Big Stories

Karimnagar Indiramma houses : ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారుల్లో చిగురిస్తున్న ఆశలు..

Karimnagar Indiramma houses : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర ఏర్పాటుకు ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది .70 గజాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కానీ లబ్ధిదారులకి అందించడంలో‌ ఆలస్యమైంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 లో బీఅర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. తొమ్మిదిన్నర ఏళ్ల బీఅర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇందిరమ్మ ఇళ్లపై నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తికాలేదు.

- Advertisement -

గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది. రుణాలు కూడా మంజూరు చేసింది. అయితే అప్పట్లో రెండు విడతల్లో ఈ ఇళ్లను మంజూరు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం నీరుకారి పోయి ముందుకు సాగలేదు. ఈ ఇళ్ల లబ్ధిదారులు ఎంపికలో అక్రమాలు జరిగాయని బీఅర్ఎస్ ప్రభుత్వం విచారణ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల స్థానంలో డబుల్ బెడ్ ఇళ్లు ఇస్తామని ప్రజలకు ఆశ చూపింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదని ప్రజలు అంటున్నారు.

- Advertisement -

అప్పట్లో నిర్మాణం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయి. లబ్ధిదారులు కనీస వసతలు లేకపోవడంతో ఈ కాలనీలో అడుగు పెట్టలేకపోయారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇందిరమ్మ ఇళ్లు మరింత అధ్వాన్నంగా మారిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఇళ్లకు ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. మళ్లీ తిరిగి పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో లబ్ధిదారులు ఆశలు చిగురుస్తున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. అంతేకాదు కనీస సౌకర్యాలు కల్పిస్తారనే అభిప్రాయం వ్యక్తయవుతోంది. చాలా మంది లబ్ధిదారులు అప్పులు తెచ్చి ఇళ్లను నిర్మించుకున్నారు. ప్రభుత్వం నిధులు ఇస్తుందని ఆశపడుతున్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటివరకు ఇంటి నెంబర్లు ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. విద్యుత్ కనెక్షన్ లేని కారణంగా ఇందిరమ్మ కాలనీ అంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. లబ్ధిదారులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని లబ్ధిదారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు .

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News