BigTV English

Sharmila: పిల్లిని గదిలో బంధిస్తే..? పోలీసుల ట్రాప్‌లో షర్మిల!?

Sharmila: పిల్లిని గదిలో బంధిస్తే..? పోలీసుల ట్రాప్‌లో షర్మిల!?
ys sharmila

YS Sharmila Today News (Police vs YS Sharmila): షర్మిల పోలీసులను కొట్టారు. ఆమెపై ఐపీసీ 353, 332, 503, 427 సెక్షన్ల కింద కేసు పెట్టారు. అయ్యో.. కూతురును అరెస్ట్ చేశారే అనే ఆవేదనతో కూడిన ఆగ్రహంలో.. విజయమ్మ కూడా ఖాకీలపై చేయి చేసుకున్నారు. షర్మిల పోలీసులను తోసేసే.. కొట్టేసే.. విజువల్స్ బాగున్నాయి. ఇంకే మీడియా ఛానెల్స్ నాన్‌స్టాప్‌గా బ్రేకింగ్ న్యూస్ నడిపేశాయి. గంటల తరబడి పండుగ చేసుకున్నాయ్. చూసే వాళ్లంతా షర్మిలదే తప్పు అనేలా ఫీలింగ్ కలిగించాయ్.


షర్మిలను కావాలనే రెచ్చగొట్టారా?
కావొచ్చు. షర్మిలది తప్పే కావొచ్చు. పోలీసులను నెట్టడం, కొట్టడం శిక్షార్హమే. అందుకే, కేసు పెట్టారు కూడా. ఇంత వరకూ ఓకే.. కానీ అసలు షర్మిల ఖాకీలపై అంతలా వీరంగం ఎందుకేశారు? పోలీసులపై అంత దురుసుగా ఎందుకు ప్రవర్తించారు? దాడి చేసేంత కోపం ఆమెకు ఎందుకొచ్చింది? వచ్చిందా, తీసుకొచ్చారా? తానేమీ ధర్నాకు, నిరసనకు, దీక్షకు పిలుపు ఇవ్వలేదని.. ఇంట్లో నుంచి బయటకొస్తుంటే అరెస్ట్ చేస్తారా? అనేది షర్మిల ప్రశ్న. షర్మిల సరే.. ఏదో ఆవేశపడ్డారులే అనుకున్నా.. మరి, శాంతమూర్తిలా కనిపించే విజయమ్మ సైతం చేయ్యెత్తి కొట్టేంత పరిస్థితి ఎందుకొచ్చింది? గట్టిగా మాట్లాడటమే రాని విజయమ్మ.. పోలీసులను కొట్టేందుకు కారణం ఏంటి?

షర్మిలపై పోలీసుల వ్యూహం ఇదేనా?
పిల్లిని గదిలో బంధిస్తే తిరగబడకుండా ఉంటుందా? ఇదే షర్మిల మద్దతుదారుల నుంచి వస్తున్న ఆన్సర్. షర్మిల మానవ హక్కులు హరించేలా పోలీసులు పదే పదే వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉంది. పాదయాత్ర చేస్తే అడ్డుకున్నారు. దీక్ష చేస్తే అడ్డుకున్నారు. ధర్నా చేస్తే అడ్డుకున్నారు. నిరసన చేస్తే అడ్డుకున్నారు. ఇప్పుడు సిట్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ఇంట్లో నుంచి బయటకు వస్తే కూడా అడ్డుకున్నారంటూ.. మండిపడుతున్నారు. తప్పంతా పోలీసులదేనని.. కావాలనే షర్మిలను కంటిన్యూయస్‌గా కార్నర్ చేస్తున్నారని తప్పుబడుతున్నారు. బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలకో రూల్.. షర్మిలకు మరో రూలా? అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్‌టీపీ అధినేత్రిని అసహనానికి గురి చేసి.. ఆమెను ఆగ్రహానికి లోను చేసి.. పోలీసులు పరోక్షంగా తమకు కావాల్సిన రియాక్షన్‌ను ఆమె నుంచి వచ్చేలా చేశారనే ఆరోపణ కూడా వినిపిస్తోంది. ఇదంతా, ఖాకీలు అమలు చేసిన వ్యూహాత్మక ఎత్తుగడ అంటున్నారు.


పోలీసుల ట్రాప్‌లో షర్మిల!
షర్మిల ఈజీగా పోలీసుల వ్యూహానికి చిక్కుకున్నారని అంటున్నారు. పోలీసులు ఏ పని చేసినా.. ఆ వ్యవహారమంతా వీడియో షూట్ చేస్తుంటారు సాక్ష్యంగా పడుంటుందని. అందుకే, ఆన్ కెమెరా ఖాకీలు అత్యంత సత్ప్రవర్తనతో ఉంటారు. కెమెరా ఆఫ్ చేశాక తెలుస్తుంది పోలీస్ పవర్ ఏంటో. లేటెస్ట్ ఎపిసోడ్‌లో పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు. ఒకటి రెండు సార్లైతే ఆమె కూడా అందరిలానే ఆగ్రహం వ్యక్తం చేసే వరకే పరిమితమయ్యారు. కానీ, రిపీటెడ్‌గా ఇలానే అడ్డుకుంటుండటంతో ఆమెలో సహనం నశించింది. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫలితం.. పోలీసులపై ప్రతాపం. ఇదే కదా ఖాకీలకు కావాలసింది. షర్మిలతో తప్పు చేయించాలి.. దాన్ని సాకుగా చూపించి ఆమెను కట్టడి చేయాలి.. ఇదే పోలీసుల వ్యూహం అంటున్నారు. వాళ్లు అనుకున్నట్టుగానే షర్మిల చేజారారు. పోలీసులు అదంతా వీడియో తీశారు. నిమిషాల వ్యవధిలోనే మీడియాకు లీక్ చేశారు. ఆమెపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. విపక్ష నేత గొంతును చాకచక్యంగా నొక్కేశారు.. అంటున్నారు విశ్లేషకులు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×