
Sandeep Vanga :ఇప్పటి వరకు ఎన్నో అరాచక సినిమాలు చూసుంటారు. ప్రాణాలు తీసిన హారర్ సినిమాలు, ఒళ్లుగగుర్పొడిచే మూవీలు, కన్నీళ్లు పెట్టించి సినిమాలు చూసుంటారు. కాని సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న యానిమల్ సినిమా అలాంటి సినిమాల కంటే బాప్ అంటున్నారు. ఈ సినిమా చూడాలంటే… నిరభ్యంతర పత్రం తీసుకురావాలట. ఒంటరిగా సినిమా చూడాలనుకునే వాళ్లు.. వారి కుటుంబ సభ్యుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొచ్చి, థియేటర్లో సమర్పించి అప్పుడు సినిమా చూడాలనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.
సాధారణంగా సినిమాలకు ఇచ్చే సర్టిఫికేట్లలో ఏ సర్టిఫికేటే హైయెస్ట్. ఈ సర్టిఫికెట్ ఉంటే అడల్ట్స్ మాత్రమే చూడాలి. ఇక S సర్టిఫికేట్ కూడా ఉంటుంది. దీన్ని సైంటిస్టులు, డాక్టర్లు మాత్రమే చూడాలి. కాని, సందీప్ వంగా సినిమా చూడాలంటే మాత్రం ఎన్ఓసీ తప్పనిసరి అట. యానిమల్ సినిమా చూశాక… మనిషి మనస్తత్వం కచ్చితంగా మారుతుందని చెబుతున్నారు. మనిషిలోని రాక్షసత్వం బయటకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు కొందరు. అందుకే, ఈ ఎన్ఓసీ.
సందీప్ వంగా అర్జున్ రెడ్డి సినిమా తీసినప్పుడు కూడా ఇలాంటి కామెంట్సే వినిపించాయి. ముఖ్యంగా పోస్టర్లు చూసి చాలా మంది కామెంట్ చేశారు. అంత బహిరంగంగా ఇలాంటి పోస్టర్లు వేస్తే యూత్ చెడిపోరా అని ప్రశ్నించారు కూడా. పోస్టర్లలోనే అంత అసభ్యత ఉంటే.. సినిమాలో ఇంకెంత రేంజ్ ఉంటుందని ఆనాడు తెగ కామెంట్స్ చేశారు. తీరా సినిమా చూస్తే… సెన్సేషన్. అఫ్ కోర్స్ కొన్ని కొన్ని సీన్స్ అలా ఉన్నప్పటికీ… యాక్సెప్ట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ శివ సినిమా తరువాత అంతటి సెన్సేషన్, అంతటి ట్రెండ్ సృష్టించిన సినిమా అంటూ అర్జున్ రెడ్డిని కొనియాడారు.
ఇప్పుడు సందీప్ వంగా నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. యానిమల్ మామూలుగా ఉండదని పోస్టర్ బట్టే తెలుస్తోంది. ఒంటి నిండా రక్తం, చేతిలో గొడ్డలితో రణబీర్ నిజంగానే యానిమల్ గా కనిపించాడు. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషలలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.