BigTV English

BRS Party: ఆధిపత్య పోరు.. కేటీఆర్-హరీష్‌రావు మధ్య విభేదాలా? రంగంలోకి కేసీఆర్

BRS Party: ఆధిపత్య పోరు.. కేటీఆర్-హరీష్‌రావు మధ్య విభేదాలా? రంగంలోకి కేసీఆర్

BRS Party: బీఆర్ఎస్‌లో కీలక మార్పులు జరగనున్నాయా? పార్టీపై పట్టు కోసం బావబామ్మర్దుల మధ్య అంతర్గత వార్ సాగుతోందా? వీటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు గులాబీ బాస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారా? ఈ క్రమంలో పార్టీలో మార్పులు తప్పవా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్‌లో అంతర్గత కలహాలు తీవ్రమయ్యాయి. ఆధిపత్యం కోసం ఎవరికివారు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక నేతలు సైలెంట్ అయిపోయారు. ఓ వైపు కేటీఆర్.. మరోవైపు హరీష్‌రావులు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. మీడియా ముందుకొస్తున్నారు.

సింపుల్‌గా చెప్పాలంటే ఒకరిపై మరొకరికి ఆధిపత్యం అన్నమాట. ఏడాది వరకు ప్రభుత్వానికి గడువు ఇవ్వాలని కేసీఆర్ చెప్పారన్నది నేతల మాట. అయినప్పటికీ బావబామ్మర్దులు తరచూ మీడియా ముందుకొస్తున్నారు.


పార్టీలో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నారు నేతలు. రేపటి రోజున ఆ ఇద్దరిలో ఎవరు తెరపైకి వస్తారో తెలియక సైలెంట్ అవుతున్నారు. మీడియాతో మాట్లాడటానికి సైతం ముఖం చాటేస్తున్నారు నేతలు. విద్యావంతులు కేటీఆర్ వైపు, హరీష్‌రావు వైపు సామాన్యులు మొగ్గు చూపుతున్నారు.

ALSO READ:  తిరగబడుతున్న BRS సోషల్ మీడియా? వాళ్లను మార్చాలంటూ..

ఈ దశలో పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు గులాబీ బాస్. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. హరీష్‌రావు పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టు  చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో కారు పార్టీలో కీలక మార్పులు తప్పవనే టాక్ వినిపిస్తోంది.

పార్టీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ గమనిస్తున్నారు. పార్టీలో చీలిక లేకుండా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ముఖ్యంగా కేటీఆర్-హరీష్‌రావులకు టాస్క్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు వీరితో ప్రచారం చేయించాలని భావిస్తున్నారట. పాదయాత్ర వల్ల పార్టీకి మాంచి మైలేజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు కేసీఆర్. జీహెచ్ఎంసీని రెండు భాగాలుగా చేసి సౌత్‌లో హరీష్‌రావు, నార్త్‌లో కేటీఆర్‌కి అప్పగించాలని ఆలోచన చేస్తున్నారట.

ఇది సక్సెస్ అయితే ఇదే ఫార్ములా రాష్ట్రమంతా పాదయాత్రకు శ్రీకారం చుట్టాలన్నది పెద్దాయన స్కెచ్‌గా గులాబీ శ్రేణుల గుసగుసలు. బాహుబలి సినిమా మాదిరిగా మాహిష్మతి సామ్రాజ్యం పగ్గాల కోసం బాహుబలి-బళ్లాల దేవుడి మాదిరిగా పోటీ అన్నమాట. ఇందులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×