Big Stories

Priyanaka Gandhi in Telangana: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ జోరు..!

- Advertisement -

ఇలాంటివి ఎన్నో స్పీచ్‌లు.. మరేంతో ప్రచారం. ఇలా తన ప్రసంగాలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇక్కడి ప్రజల మనసులను చూరగొన్నారు. కాంగ్రెస్‌ 6 గ్యారెంటీలకు తాను గ్యారెంటీ అని హామీ ఇచ్చారు.బీఆర్ఎస్‌ పదేళ్ల పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెచ్చి పేదల కష్టాలు దూరం చేస్తామని చెప్పారు. ప్రచార సభలతో పాటు రోడ్‌ షోలతో ప్రజలను ఉత్సాహపరిచారు. అంతేకాదు బహిరంగ సభల్లోనూ ప్రియాంక గాంధీ ప్రసంగాలకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది.

- Advertisement -

Also Read: సిటీ బస్సులో రాహుల్, రేవంత్, ప్రయాణికులతో మాటా మంతీ

కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెరపైకి తెచ్చి గులాబీ నేతల విమర్శలను సమర్థంగా కౌంటర్ చేశారు ప్రియాంక.. మార్పురావాలంటే కాంగ్రెస్‌ రావాలంటూ తెలుగులో మాట్లాడి అప్పట్లో ప్రియాంక నింపిన జోష్‌ను.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో పాటు.. తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్‌ను ప్రజలు కూల్చారు.. కాంగ్రెస్‌ను గెలిపించారు. సేమ్‌ లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే టాక్టిక్‌ను ఫాలో అవుతుంది కాంగ్రెస్ అధిష్టానం. విన్నారుగా..

ప్రియాంక పదునైన మాటలు.. మోడీ, బీజేపీ టార్గెట్‌గా విరుచుకపడుతున్నారు ప్రియాంక గాంధీ.. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. కానీ ఫోర్త్‌ ఫేజ్‌ ప్రచార ముగింపులో మాత్రం ఫుల్‌ టైమ్‌ తెలంగాణకే కేటాయిస్తున్నారు ప్రియాంక.. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణకు రానున్నారు ప్రియాంక.. అప్పటి నుంచి ప్రచార సమయం ముగిసే వరకు తెలంగాణలోనే ఉండనున్నారు. మొదట ఆమె షాద్‌ నగర్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఇక ప్రచారానికి చివరి రోజైన శనివారం కామారెడ్డి, తాండూరులో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. సో కాంగ్రెస్‌ ఇచ్చే ఫైనల్‌ స్ట్రోక్.. ప్రియాంక చేతుల మీదుగానే జరగబోతుందని తెలుస్తుంది..

Also Read: Sunitha shocking comments on Bharathi: వైఎస్ భారతిపై హాట్ కామెంట్స్.. మమ్మల్ని నరికేస్తారేమో, సింగిల్‌గా ఉండటానికి..

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచార పర్వాన్ని ఇలా ముగించారు ప్రియాంక గాంధీ.. అటు క్యాడర్.. ఇటు లీడర్స్ లో జోష్ నింపారు. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార సభల్లో కూడా.. ప్రియాంక మంచి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్‌ శ్రేణులు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాయి.. తెలంగాణతో తమకు రాజకీయ సంబంధం కాదు. కుటుంబ సబంధం ఉందని ప్రియాంక గత ఎన్నికల్లో చెబుతూ వచ్చారు. ఇదే తెలంగాణ ఓటర్లను అమితంగా ఆకర్శించింది. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే రాహుల్‌ పాల్గొని
పార్టీ కేడర్‌లో మంచి ఊపును తెచ్చారు. ఇప్పుడు ప్రియాంక పర్యటన తెలంగాణలో కాంగ్రెస్‌కు మరింత బలాన్నిస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు భావిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News