Big Stories

Bulldozers Dance: బ్రేక్ డ్యాన్స్ చేసిన బుల్డోజర్లు.. ఆశ్చర్యపోయిన జనం!

Bulldozers Performs Break Dance: అక్కడ ఎన్నికల ర్యాలీ జరుగుతుంది. సీఎంతోపాటు పలువురు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. అక్కడికి జనాలు కూడా భారీగానే వచ్చారు. అయితే, అక్కడికి వచ్చిన ఆ జనాలు నేతల ప్రసంగాలను వినడం కన్నా.. ర్యాలీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద హల్ చల్ చేస్తున్న బుల్డోజర్లనే ఎక్కువగా ఆసక్తిగా చూశారు. ఆ వేదిక వద్దకు డజన్ల కొద్దీ బుల్డోజర్లు వచ్చి డ్యాన్సులు చేస్తుంటే జనమంతా ఆశ్చర్యపోయారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్న ఎన్నికల ర్యాలీకి సంబంధించిన వేదిక వద్ద ఈ సంఘటన జరిగింది. అంతేకాదు.. కార్యకర్తలు ఆ బుల్డోజర్లపైకి ఎక్కి భారీగా నినాదాలు చేశారు.

- Advertisement -

ఉత్తర ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లోక్ స్థానంలో ఉన్న అలీగంజ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. ఆయనతోపాటు పలువురు ముఖ్య నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడికి జనాలు భారీగా హాజరయ్యారు. అయితే, సీఎం యోగి రావడానికి ముందే బుల్డోజర్లను భారీగా అక్కడికి తీసుకువచ్చారు. ఆ తరువాత ఆ బుల్డోజర్లు డ్యాన్సులు చేశాయి.

- Advertisement -

సంగీతానికి అనుగుణంగా ఆ బుల్డోజర్లను ఆపరేట్లు అటూ ఇటూ తిప్పుతూ విన్యాసాలు చేయించారు. చుట్టూ తిప్పుతూ.. వెనుకవైపు ఉండే బకెట్లను కిందికి పైకి అంటూ.. ఇంజిన్ స్పీడ్ ను ఒక్కసారిగా పెంచుతూ, ఆ వెంటేనే వాటిని ముందుకు తీసుకెళ్లి, వెనువెంటనే బ్రేకులు వేస్తూ ఇలా.. బుల్డోజర్లతో ఆపరేట్లు విన్యాసాలు చేయించారు. బుల్డోజర్లపైకి కార్యకర్తలు ఎక్కి భారీగా నినాదాలు చేశారు. అయితే, అక్కడికి వచ్చిన జనాలు వేదిక వద్ద నేతల ప్రసంగాలను వినడం కంటే ఈ బుల్డోజర్లు చేస్తున్న విన్యాసాలనే ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు.

Also Read: నేడు తెరుచుకోనున్న కేదార్‌నాథ్, గంగోత్రి ఆలయాలు

అయితే, 2017లో విజయం సాధించిన తరువాత యూపీ సీఎంగా యోగి ఆధిత్యనాథ్ పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కొంతకాలం తరువాత గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేకు చెందిన కాంప్లెక్స్ ను బుల్డోజర్ ద్వారా కూలగొట్టినప్పటి నుండి బుల్డోజర్ కు యోగి ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపును ఇస్తూ వచ్చింది. రాష్ట్రంలో కిడ్నాప్, హత్యల ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు రాజకీయ నాయకులపై కూడా బుల్డోజర్ చర్యలు తీసుకున్నది.

బుల్డోజర్ల విషయమై గత ఎన్నికల్లో కూడా సమాజ్ వాదీ పార్టీ విమర్శలు చేసింది.. దీనిపై బీజేపీ స్పందిస్తూ నేరస్థులను అణిచివేసేందుకు బుల్డోజర్లను ఉపయోగిస్తామంటూ పేర్కొన్నది. అయితే, యోగి ప్రభుత్వం యూపీలో బుల్డోజర్ల చర్యలను కొనసాగిస్తూ వచ్చింది. పలు జిల్లాల్లో కూడా అక్రమ కట్టడాలను తొలగిస్తుండగా పలువురి పేదల ఇళ్లు కూడా ఈ బుల్డోజర్ల కింద కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే, గతంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అభివృద్ధి చేయడమే కాదు.. బుల్డోజర్లను కూడా ఉపయోగించిందంటూ పేర్కొన్న విషయం విధితమే. అయితే ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకుని బుల్డోజర్లను ప్రయోగిస్తున్నారంటూ యూపీ సర్కారుపై భారీగా విమర్శలు కూడా వచ్చాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News