E-Paper
Advertisement

MLA Vivekananda gives Clarity: కాంగ్రెస్‌లోకి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే..? స్పందించిన వివేకానంద

MLA Vivekananda gives Clarity: కాంగ్రెస్‌లోకి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే..? స్పందించిన వివేకానంద
Advertisement

MLA Vivekananda gives Clarity on Party Change Rumors: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ స్పందించారు. ఈ ప్రచారాన్ని తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తాని చెప్పారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ ను ముందు తానే వేశానంటూ గుర్తుచేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా వేటు పడుతుందన్నారు. తన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనంటూ స్పష్టం చేశారు.

కాగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశవ్యాప్తంగా ఈ వలసలపై చర్చ కొనసాగుతుంది. గతంలో ఏకచక్రాధిపత్యం చేసిన కేసీఆర్ ను తన సొంత ఎమ్మెల్యేలు నమ్మడంలేదా..? లేక వారు పార్టీ మారకుండా కాపాడుకోలేకపోతున్నారా..? అంటూ చర్చించుకుంటున్నారు.

Advertisement

Also Read: కేసీఆర్‌కు మరో షాక్.. నేడు కాంగ్రెస్‌లో చేరనున్న మరో ఎమ్మెల్యే

వివేకానంద విషయంలో కూడా జనాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలామంది ముందుగా ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టి ఇదేవిధంగా చెప్పారని.. ఆ తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారంటున్నారు. వివేకానంద విషయంలో ఇలాగే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు జనాలు.

Tags

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×