BigTV English

Weather Update: రాష్ట్రంలో 4 రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో పిడుగుల వర్షం, అత్యవసరం అయితే తప్ప..?

Weather Update: రాష్ట్రంలో 4 రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో పిడుగుల వర్షం, అత్యవసరం అయితే తప్ప..?

Weather Update: గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు, హైదరాబాద్ మహా నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతున్నాయి. సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. హైదరాబాద్ లో పది నిమిషాల వర్షానికే రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలను హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.


ఇవాళ ఈ జిల్లాల్లో వర్షం…

ఇవాళ్లి నుంచి రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. యాదాద్రి- భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, సూర్యాపేట, ఖమ్మం, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌, కామారెడ్డి, మంచిర్యాల, నారాయణపేట, జోగులాంబ గద్వాల,  హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు పేర్కొన్నారు. ఉరుములు మెరుపులతో పాటు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. అలాగే పలు ప్రాంతాల్లో పిడుగుల పడే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ లో సాయంత్రం వేళ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరు బయటకు వెళ్లొద్దని.. ఆఫీసులకు వెళ్లిన వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.


ALSO READ: Sub Inspector: డిగ్రీ అర్హతతో 2861 ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. అక్షరాల రూ.1,12,400 జీతం

కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..

మరో గంట నుంచి రెండు గంట్లలో హైదరాబాద్ మహా నగరంలో పలు చోట్ల కుండపోత వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఖైరతాబాద్, షేక్ పేట్, టోలీ చౌకీ, గోల్కొండ, మెహదీ పట్నం, నాంపల్లి, చార్మినార్, బహదూర్ పుర, కిషన్ బాగ్, రాజేంద్రనగర్, చంద్రయాణ్ గుట్ట, అల్వాల్, మల్కాజిగిరి, ఉప్పల్, కాప్రా, ఎల్బీనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో మరి కాసేపట్లో వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ఇక రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో కాసేపట్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

ALSO READ: Farmer Scheme: వ్యవసాయ భూమి ఉంటే చాలు.. ఈజీగా రూ.50వేలు పొందవచ్చు.. అప్లికేషన్ విధానం ఇదే..

అధికారుల హెచ్చరిక..

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. పిడుగులు పడే ఛాన్స్ ఉండడంతో చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. భారీ వర్షం పడుతున్న సమయంలో ఇంట్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు తెలిపారు.

Related News

BC Reservations: హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా

Cough Syrups: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ రెండు దగ్గు మందులు బ్యాన్

Farmer Scheme: వ్యవసాయ భూమి ఉంటే చాలు.. ఈజీగా రూ.50వేలు పొందవచ్చు.. అప్లికేషన్ విధానం ఇదే..

Heavy Rains: భారీ వర్షాలు.. మరో మూడు రోజులు దంచుడే దంచుడు..

Ponnam And Adluri Comments: ముగిసిన మంత్రుల వివాదం.. అడ్లూరికి క్షమాపణ చెప్పిన పొన్నం..

Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు.. ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే

Fire Accident: నల్గొండ జిల్లా హాలియా SBIలో అగ్నిప్రమాదం..

Big Stories

×