BigTV English

Viral News: ఉద్యోగికి పొరపాటున 300 రెట్లు ఎక్కువ జీతం చెల్లించిన కంపెనీ, ఊహించని తీర్పు ఇచ్చిన కోర్టు!

Viral News: ఉద్యోగికి పొరపాటున 300 రెట్లు ఎక్కువ జీతం చెల్లించిన కంపెనీ, ఊహించని తీర్పు ఇచ్చిన కోర్టు!

Chile Employee Salary:

అప్పడుప్పుడు మన అకౌంట్లలోకి పొరపాటుగా డబ్బులు పడుతుంటాయి. డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోన్ నెంబర్లు పొరపాటుగా టైప్ చేయడం వల్ల ఇతరుల అకౌంట్లలోకి డబ్బులు వెళ్తాయి. ఆ డబ్బులను చాలా మంది వెనక్కి పంపిస్తుంటారు. కానీ, చిలీలో ఓ వింత ఘటన జరిగింది. ఓ ఉద్యోగి సాలరీ అకౌంట్ లోకి పడాల్సిన జీతం కంటే ఏకంగా 300 రెట్లు ఎక్కువ పడింది. ఈ విషయం వెంటనే గమనించిన కంపెనీ, సాలరీ మినహా మిగతా డబ్బును వెనక్కి ఇవ్వాలని కోరింది. తొలుత ఇచ్చేందుకు సరే అని చెప్పిన ఉద్యోగి, ఆ తర్వాత మనసు మార్చుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వకుండానే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో సరదు కంపెనీ ఉద్యోగి మోసానికి సంబంధించి కోర్టుకు వెళ్లింది. అయితే, సదరు కోర్టు కూడా ఉద్యోగికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అందరూ షాకయ్యారు.


ఇదీ అసలు జరిగిన కథ..

డాన్ కన్సార్సియో ఇండస్ట్రియల్ డి అలిమెంటోస్ డి చిలీ అనే ఫుడ్ కంపెనీలో ఓ వ్యక్తి సాధారణ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడికి నెలవారీ జీతం 386 పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ.40 వేలు). 2022 మే నెలలో అతడి అకౌంట్ లోకి పొరపాటుగా  1,27,000 పౌండ్లు(భారత కరెన్సీలో సుమారు రూ.1.3 కోట్లు) జమ అయ్యాయి. వెంటనే కంపెనీ ఫైనాన్స్ డిమార్ట్ మెంట్ ఈ విషయాన్ని గుర్తించింది. డబ్బును వెనక్కి ఇవ్వాలని సదరు ఉద్యోగిని కోరారు. తొలుత తను సరే అన్నాడు. కానీ, ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో మనసు మారింది. చడీ చప్పుడు లేకుండా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. డబ్బులు కూడా ఇవ్వనని చెప్పాడు. ఏం చేయాలో అర్థంకాని కంపెనీ ప్రతినిధులు సదరు ఉద్యోగిపై కోర్టులో కేసు వేశారు. దొంగతనం ఆరోపణలు చేశారు. ఈ కేసును శాంటియాగోలోని కోర్టు విచారించింది. చివరికి  ఉద్యోగికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఉద్యోగి చేసింది దొంగతనం కాదని తేల్చింది. అనధికారిక సేకరణ మాత్రమేనని వెల్లడించింది. ఈ కేసును నేరంగా భావించలేమని వెల్లడించింది. అంతేకాదు, ఆ డబ్బును అతడు తన అవసరాలకు వాడుకోవచ్చని తీర్పు చెప్పింది.

Read Also:  ఛీ.. సూప్ లో మూత్రం పోసిన టీనేజర్, రూ.2.56 కోట్లు జరిమానా విధించిన కోర్టు!


కోర్టు తీర్పుపై కంపెనీ ప్రతినిధుల అసంతృప్తి

అటు కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సదరు కంపెనీ ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. డబ్బును తిరిగి తెప్పించుకునే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. కోర్టు తీర్పును మళ్లీ సమీక్షించి రద్దు చేయాలని కోరనున్నట్లు తెలిపారు. న్యాయపరంగా ఉన్న ఇతర మార్గాలను ఉపయోగించుకుంటామని సూచించారు. మొత్తంగా ఈ తీర్పు ఇప్పుడు చిలీలో హాట్ టాపిక్ గా మారింది.

Read Also: ఒకే వ్యక్తికి 1638 క్రెడిట్ కార్డులు.. అన్నీ పనిచేసేవే, గిన్నీస్ రికార్డుకు ఎక్కేశాడుగా!

Related News

Viral Video: కారుపై ముద్దులాట.. కౌగిలింతలతో బరితెగింపు.. ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

Credit Cards: ఒకే వ్యక్తికి 1638 క్రెడిట్ కార్డులు.. అన్నీ పనిచేసేవే, గిన్నీస్ రికార్డుకు ఎక్కేశాడుగా!

Viral News: రాత్రయితే నాగినిగా మారి కాటేస్తున్న భార్య.. కలెక్టర్ కు భర్త ఫిర్యాదు!

Viral Video: ఓయమ్మా.. మోడీఫై స్కూటర్.. రంగురంగుల లైట్లతో ఎంత బాగా మెరిసిపోతుందో?

Viral Video: కోడికి కొత్త రెక్కలు.. డ్రోన్‌తో ఎలా ఎగిరిందో చూడండి!

Central Jail: రాజభోగాలుగా సెంట్రల్ జైలు.. అండ‌ర్ ట్రయల్ ఖైదీ బర్త్ డే వేడుకలు, వీడియో వైరల్

Viral video: ఈ బుడ్డోడు జాతీయ గీతాన్ని ఎంత చక్కగా ఆలపించాడో.. మీరు కూడా చూసేయండి బ్రో, వీడియో మస్త్ వైరల్

Big Stories

×