Big Stories

Rahul Gandhi : రేవంతే ఫైనల్.. రాహుల్ అల్టిమేటం.. ఎనీ డౌట్స్?

Rahul Gandhi : రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వరకు రేవంత్ రెడ్డినే ఫైనల్ అని పరోక్షంగా తేల్చి చెప్పేశారు. రేవంత్ నాయకత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ ఏది చెబితే అది. పార్టీ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నా. తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. టీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిపై తన నమ్మకాన్ని మరోసారి చాటుకున్నారు.

- Advertisement -

రాహుల్ గాంధీ నేరుగా రేవంత్ పేరును ప్రస్తావించకున్నా.. పరోక్షంగా ఆయన ఆధ్వర్యంలోని రాష్ట్ర కాంగ్రెస్ ఏం చెబితే అదే ఫైనల్ అన్నట్టు మాట్లాడారు రాహుల్. టీఆర్ఎస్, కాంగ్రెస్ దొందుదొందేనంటూ బీజేపీ చేస్తున్న ప్రచారానికి, విమర్శలకు చెక్ పెట్టారు.

- Advertisement -

రాష్ట్ర కాంగ్రెస్ అంటే ఇంకెవరు పీసీసీనే. మరి, ఆ పీసీసీ ప్రెసిడెంట్ ఎవరు? ఇంకెవరు రేవంత్ రెడ్డినే. స్టేట్ కాంగ్రెస్ నిర్ణయమే అంతిమం అంటే.. రేవంత్ రెడ్డి డెసిషనే ఫైనల్ అనేగా అర్థం అంటున్నారు. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా రేవంత్ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు రాహుల్ గాంధీ.

రాహుల్ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కు కంట్లో నలుసుగా మారిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోతుంది.. త్వరలోనే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతా.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానంటూ.. పగటి కలలు కంటున్న కోమటిరెడ్డికి రాహుల్ కామెంట్లు అంతగా రుచించకపోవచ్చు అంటున్నారు. వెంకట్ రెడ్డితో పాటు రేవంత్ ను పీసీసీ చీఫ్ కుర్చీ నుంచి దించేయాలని.. తెరవెనుక కుట్రలు చేస్తున్న సీనియర్లకు సైతం ఇది షాకింగ్ విషయమే.

తనపై కుట్ర చేస్తున్నారంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మునుగోడులో సీనియర్లు అంతా సైడ్ అయిపోయారని.. కేసీఆర్ తో కలిసి గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి.. అది సాకుగా చూపి.. తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి దించేయాలనే కుట్ర చేస్తున్న వాళ్ల పేర్లు త్వరలోనే బయటపెడతానన్నారు రేవంత్. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ పై స్వయంగా రాహుల్ గాంధీనే సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించడం.. రేవంత్ కు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టైందని అంటున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రేవంత్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేసేలా.. రేవంత్ కోసం ప్రత్యేక హెలికాప్టర్ అరేంజ్ చేశారు. కొడంగల్ లో కాంగ్రెస్ జెండా ఎగరకపోయినా.. ఎంపీగా రేవంత్ రెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు. ఆ తర్వాత రాహుల్ చొరవతో.. పీసీసీ పగ్గాలను రేవంత్ చేతిలో పెట్టారు. సీనియర్లు కాదన్నా.. రేవంత్ నే అధ్యక్షుడిని చేశారు. అసమ్మతి స్వరాలను గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ.. ఆయన ఏం చెబితే అదే ఫైనల్ అంటూ మరోసారి బహిరంగ మెసేజ్ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఎనీ డౌట్స్?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News