E-Paper
Advertisement

Elon Musk : ఎలాన్ మస్క్ సలహాదారుగా భారతీయుడు..ఎవరతను?

Elon Musk : ఎలాన్ మస్క్ సలహాదారుగా భారతీయుడు..ఎవరతను?
Advertisement

Elon Musk : ట్విటర్‌ కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రూ.3.3 లక్షల కోట్లతో ఈ సంస్థను కొనుగోలు చేసి అనూహ్యమైన నిర్ణయాలు తీసుంటూ ఆ సంస్థ ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత తొలి రోజే ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్‌, లీగల్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ గద్దెను తొలగించారు. అలాగే ఆ సంస్థ సీఎఫ్‌వో నెడ్‌ సెగల్‌, జనరల్‌ కౌన్సిల్‌ సీన్‌ ఎడ్జెట్‌ సహా మరికొంత మంది టాప్‌ ఎగ్జిక్యూటివ్ లకు ఉద్వాసన పలికారు. యూజర్ల ట్వీట్లు 280 పదాలు మించకూడదు. అయితే ఇప్పుడు ట్వీట్ లో పదాల సంఖ్యను పెంచాలనుకుంటున్నారు. ఈ నిర్ణయాలన్నీ చర్చాంశనీయంగా మారాయి.

అయితే ట్విటర్‌పై మస్క్‌ నిర్ణయాల వెనుక భారతీయుడు శ్రీరామ్ కృష్ణన్ ఉన్నారట. మస్క్‌కు తాత్కాలికంగా సహాయం చేస్తున్నట్లు శ్రీరామ్ ట్వీట్‌ చేశారు. తాను కొంతమంది గొప్ప వ్యక్తులతో కలిసి మస్క్‌కి సహాయం చేస్తున్నానని వెల్లడించారు. తన నిర్ణయాలు ప్రపంచంపై, ఎలాన్‌ మస్క్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపగలవని నమ్ముతున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఎవరీ శ్రీరామ్?
శ్రీరామ్ కృష్ణన్ స్వస్థలం చెన్నై. 2001-2005 మధ్య అన్నా యూనివర్సిటీ పరిధిలోని ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కాలేజ్‌ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్‌లో విజువల్‌ స్టూడియో విభాగంలో ప్రోగ్రాం మేనేజర్‌గా కెరియర్‌ ప్రారంభించారు .ఆ తర్వాత డైరెక్ట్ రెస్పాన్స్ యాడ్స్ బిజినెస్, డిస్‌ప్లే అడ్వర్టైజింగ్‌లో అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటైన మెటా , స్నాప్‌లలో ఆడియన్స్ నెట్‌వర్క్‌ ల్లో పనిచేయడంతోపాటు, వివిధ మొబైల్ యాడ్‌ ప్రొడక్ట్‌లను తయారు చేశారు. ఓ వైపు దిగ్గజ కంపెనీల్లో ప్రాజెక్ట్‌లు చేస్తూనే వెంచర్‌ క్యాప్టలిస్ట్‌గా శ్రీరామ్ ఎదిగారు.

Advertisement

2021 ప్రారంభంలో కృష్ణన్ భార్య ఆర్తి రామమూర్తి స్టార్టప్‌ల నుంచి వెంచర్ క్యాపిటలిజం, క్రిప్టో కరెన్సీలపై క్లబ్‌హౌస్ టాక్ షోను ప్రారంభించారు. ఆర్తి రామమూర్తి హోస్ట్‌గా వ్యవహరించిన ఆ షోకి ఎలాన్‌ మస్క్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. సోషల్‌ మీడియా దిగ్గజ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో శ్రీరామ్ కృష్ణన్ నుంచి ఎలాన్ మస్క సలహాలు, సూచనలను తీసుకుంటున్నారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×