E-Paper
Advertisement

Weather Updates: అలర్ట్‌గా ఉండండి.. కొద్దిసేపట్లో భారీ వర్షం పడొచ్చు!

Weather Updates: అలర్ట్‌గా ఉండండి.. కొద్దిసేపట్లో భారీ వర్షం పడొచ్చు!
Advertisement

Weather Updates in Telangana: అధిక ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు చోట్లా కొద్దిసేపట్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అయితే, కొన్ని చోట్లా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

రాష్ట్రంలోని జనగామ, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ములుగు, మహబూబ్ నగర్, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతిచెందినట్లు సమాచారం. మృతులు వరంగల్, ఏటూరునాగారానికి చెందిన రైతులుగా తెలుస్తోంది.

Advertisement

అయితే, గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. పలు చోట్లా 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన విషయం తెలిసిందే. ఈ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం ఇంటి బయటకు వెళ్లాలంటేనే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి.

Also Read: వాళ్లు మళ్లీ కుట్ర పన్నుతున్నారు.. తిప్పికొట్టండి: సీఎం రేవంత్

Advertisement

ఈ నేపథ్యంలో వాతావరణశాఖ వర్షానికి సంబంధించిన సూచనను తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వర్షాలు ఉపశమనంగా మారునున్నాయి.

Tags

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×