Hyderabad News: భారీ వర్షాల ఫలితమో.. అడవులు పెరగడం వల్ల తెలీదు. అడవిలో ఉండే జంతువులు ఇప్పుడు నగరాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో విష జంతువుల బెడద మరీ ఎక్కువగా ఉంది. దీంతో శివారు ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా 12 అడుగుల భారీ మొసలి కనిపించడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇంతకీ ఎక్కడ?
హైదరాబాద్ శివారులో జంతువుల హంగామా
హైదరాబాద్ సిటీలో ఇటీవల భారీ వర్షాలు పడ్డాయి. వరదల ధాటికి విష జంతువులు నీటిలో కొట్టుకువచ్చాయి. ఇప్పుడు శివారు ప్రాంతాల ప్రజలను హడలెత్తిస్తున్నాయి. వాటిని చూసి భయంతో వణికిపోతున్నారు. నార్మల్‌గా హైదరాబాద్ నగరం నలువైపులా పులులు సంచారం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు పులులు కనిపిస్తున్నాయి. వాటితో ఆ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు.
తమపై ఎప్పుడు దాడి చేస్తాయోనని బెంబేలెత్తుతున్నారు. ఇదిలావుండగా నగరంలో ఇటీవల కురిసిన వర్షాలు విష పూరిత జంతువులు కొండచిలువలు, మొసళ్లు బయటకు వస్తున్నాయి. తాజాగా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతి పేట్‌లో 12 అడుగుల మొసలి సంచరించింది. దాన్ని చూసి భయబ్రాంతులకు గురయ్యారు గ్రామస్తులు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
12 అడుగుల మొసలి
వారు వచ్చి మొసలిని బంధించి జూపార్క్‌కు తరలించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సిటీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాములు, కొండ చిలువలు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. మొన్నటివరకు మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలకు కొండచిలువలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి.. ఇంకా చేస్తున్నాయి. కూడా.
మియాపూర్ పరిధిలోని బాచుపల్లిలో కొండచిలువ ఓ అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులో ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని దాన్ని బంధించారు. ఆ తర్వాత అడవిలో వదిలేశారు.
ALSO READ: జూబ్లీహిల్స్ బైపోల్.. బీజేపీ గేమ్ మొదలైంది
ఇలా చీటికి మాటికీ విష జంతువులు కనిపించడంతో హడలిపోతున్నారు ఆ ప్రాంతాల ప్రజలు. విష జంతువులు కదలికలు ఉన్న ప్రాంతాల్లో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తున్నారు అధికారులు. చిన్న పిల్లలను ఒంటరిగా బయటకు పంపొద్దని హెచ్చరించారు కూడా.
హైదరాబాద్ నగర శివారులో భారీ మొసలి..
అబ్దుల్లాపూర్ మెట్ మండలం తారామతి పేట్ లో 12 అడుగుల మొసలి సంచారం
మొసలిని చూసి భయబ్రాంతులకు గురైన గ్రామస్తులు
అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మొసలిని బంధించి జూపార్క్ కు తరలించడంతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు pic.twitter.com/eegis1wwJr
— BIG TV Breaking News (@bigtvtelugu) October 10, 2025