BigTV English

Hyderabad: రేప్ చేసి విదేశాలకు పారిపోయే ప్రయత్నం.. రంగంలోకి దూకిన పోలీసులు

Hyderabad: రేప్ చేసి విదేశాలకు పారిపోయే ప్రయత్నం.. రంగంలోకి దూకిన పోలీసులు

Rape incident in Hyderabad(Crime News in Telugu): ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతికి ఓ యువకుడు వల వేశాడు. క్లోజ్‌గా మాట్లాడుతూ డైరెక్ట్‌గా కలుద్దామని ప్రపోజల్ పెట్టాడు. ఆ యువకుడు ఆస్ట్రేలియా ఉంటున్నాడు. యువతిది ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్. ఇద్దరూ కలవడానికి స్పాట్‌గా సికింద్రాబాద్‌‌ను ఫిక్స్ చేశాడు. యువకుడి మాటలు నమ్మి ఆ యువతి రాయ్‌పూర్ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చింది. యువకుడు కూడా ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు వచ్చేశాడు. ఓ హోటల్‌ బుక్ చేశాడు. యువతిని ఆ హోటల్‌ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. యువకుడిని బ్లైండ్‌గా నమ్మిన ఆ యువతి.. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అందుకు యువకుడు ముఖం చాటేశాడు. పనైపోయింది అన్నట్టుగా తిరిగి ఆస్ట్రేలియా ప్రయాణానికి రెడీ అయ్యాడు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. మరికాసేపైతే విమానం ఎక్కేసేవాడే. ఇంతలో పోలీసులు అలర్ట్ అయ్యారు. యువకుడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.


వరంగల్ జనగామాకు చెందిన స్వామి ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆయన ఫేస్‌బుక్‌లో ఛత్తీస్‌గడ్‌కు చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. కల్లిబొల్లి కబుర్లు చెప్పాడు. ముగ్గులోకి దింపాడు. సరదాగా ఓ సారి నేరుగా కలుద్దామని మాయ మాటలు చెప్పాడు. సికింద్రాబాద్‌కు రావాలని కోరాడు. ఆ యువతి సికింద్రాబాద్‌కు వచ్చేసింది. యువకుడు కూడా ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌లో దిగాడు. మహంకాళిలో ఓ హోటల్ బుక్ చేశాడు. యువతిని ఆ హోటల్ తీసుకెళ్లాడు. ఆ యువతిపై స్వామి లైంగికదాడికి పాల్పడ్డాడు.

Also Read: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళన.. డిప్యూటీ సీఎం భట్టి ఫైర్


ఆ తర్వాత యువతి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది. అందుకు స్వామి నిరాకరించాడు. మళ్లీ ఆస్ట్రేలియాకు బయల్దేరి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడ. బాధిత యువతి తాను మోసపోయానని గ్రహించింది. వెంటనే మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మహంకాళి పోలీసులు ఓఆర్ఆర్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులతో సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. స్వామిని ఫ్లైట్ ఎక్కడానికి కొన్ని నిమిషాల ముందు అడ్డుకున్నారు. అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×