Big Stories

Raja Singh | అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్‌ అయితే.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయను : రాజా సింగ్

Raja Singh | గోషామాల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే.. తాను మాత్రమే కాదు.. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ ప్రమాణం చేయరని స్పష్టం చేశారు. రేపటి అసెంబ్లీని బహిష్కరిస్తున్నామంటూ తెలిపారు ఆయన. ఖాసిం రిజ్వి వారసుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ అని.. ఆయన ముందు తాము ఎమ్మెల్యేలుగా ప్రయాణం చేయమన్నారు. గతంలో హిందువుల విషయంలో అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారుని.. దేశానికి ,హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తికి ప్రోటేం స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ ఎలా అవకాశమిచ్చిందని ప్రశ్నించారు.

- Advertisement -

తెలంగాణ 3వ శాసనసభ.. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీతో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్న అక్బరుద్దీన్‌ ఒవైసీ.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణం చేయిస్తారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్‌ నియామకంపై రాజ్‌భవన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

- Advertisement -

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, అసెంబ్లీ సెక్రటరీ చారి, సమాచారశాఖ కమీషనర్ అశోక్‌రెడ్డి పర్యవేక్షించారు. భద్రతతో పాటు ట్రాఫిక్ తదితర అంశాలపైనా.. అధికారులతో CS చర్చించారు.

ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ పరిసరాల్లో ఉదయం 7 తర్వాత పోలీసులు భారీ బందోబస్తు చేయనున్నారు. ఈ కారణంగా అసెంబ్లీ పరిసరాల్లో వాకింగ్ చేసేవారు ఉదయం 7 గంటలలోపు అధికారులు ముగించుకోవాలన్నారు. పబ్లిక్‌ గార్డెన్స్‌ వద్ద ఉదయం 7 గంటలలోపు ముగించుకోవాలన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News