E-Paper
Advertisement

Medchal News: ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలు పంపిణీ చేసిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్

Medchal News: ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలు పంపిణీ చేసిన డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
Advertisement

Medchal News:  మేడ్చల్ స్వేచ్ఛ, బ్యూరో: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు రంజన్ కానుకగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామన్న గారి రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కిట్లను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో సుమారు 5000 మందికి రంజన్ కానుక పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాసంలో పేద మరియు అవసరమైన ముస్లిం కుటుంబాలకు సహాయం చేయడం మంచి కార్యక్రమమని అభినందించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్‌ల ద్వారా తాగునీటి సరఫరా కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు.

Also Read: Earthen Pot Water: కుండలో నీళ్లు తాగడం మంచిదేనా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? ఏ రంగు కుండ ఉత్తమం?

సమాజానికి సేవ చేసే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి 

Advertisement

రామన్న గారి రాఘవేందర్ గౌడ్ తనకు తోచిన విధంగా ప్రజలకు సేవ చేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, సమాజానికి సేవ చేసే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. మనమంతా భారత దేశ ప్రజలమని, కుల మతాలకు అతీతంగా అందరం కలిసి పండుగలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కొంత మంది కావాలనే మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి వాటిని పట్టించుకోకుండా సోదరభావంతో కలిసి జీవించాలని సూచించారు.

ముస్లిం సోదరులకు రంజన్ కానుక

రామన్న గారి రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజన్ కానుక అందించడం తమకు ఆనవాయితీగా మారిందన్నారు. పేద కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టిఏ మెంబర్ జైపాల్ రెడ్డి,మేడ్చల్ మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ అధ్యక్షుడు సాయి పేట శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు చాపరాజు,శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లేష్ గౌడ్. రంజిత్ , ఆరిఫ్ ,సయ్యద్ లాయక్ అలీ, రఫిక్ , ఇమ్రాన్,ఇనయత్,తదితరులు పాల్గొన్నారు.

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×