E-Paper
Advertisement

BEL Recruitment 2026: రూ.60వేల జీతంతో బెల్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉన్నవారందరూ అప్లై చేసుకోవచ్చు..!

BEL Recruitment 2026: రూ.60వేల జీతంతో బెల్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉన్నవారందరూ అప్లై చేసుకోవచ్చు..!
Advertisement

BEL Recruitment 2026: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్.. బీఈ లేదా బీటెక్ చేసిన వారు అయితే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ప్రక్రియ, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నవరత్న సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. నెట్‌వర్క్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో కాంట్రాక్ట్ విధానంలో సేవలందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నియామకాల ద్వారా మొత్తం 18 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారు దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 18

ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు విభాగాల్లో సిబ్బందిని ఎంపిక చేస్తున్నారు. ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ (FOE) హోదాలో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్-I హోదాలో 12 పోస్టులు భర్తీ కానున్నాయి. అభ్యర్థులు తమ అర్హతలను బట్టి సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

విద్యార్హత: 

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సీఎస్ లేదా ఈసీ వంటి సంబంధిత విభాగాల్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు అవుతారు. వీటితో పాటు నిర్దేశిత సర్టిఫికెట్లు కలిగి ఉండటం తప్పనిసరి. అనుభవం విషయానికి వస్తే  2026 ఫిబ్రవరి 1 నాటికి ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్లకు కనీసం ఐదేళ్లు అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్లకు రెండేళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంటే సరిపోతుంది.

వయస్సు: 

ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 2026 ఫిబ్రవరి 1 నాటికి 35 ఏళ్ల వయస్సు మించరాదు. ప్రాజెక్ట్ ఇంజనీర్లకు 32 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్లకు నెలకు రూ. 60,000, అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్లకు రూ. 40,000 గౌరవ వేతనంగా అందిస్తారు. ప్రతి ఏటా రూ. 5,000 చొప్పున వేతన పెరుగుదల ఉంటుంది. బీమా, ఇతర అలవెన్సుల కోసం ఏడాదికి అదనంగా రూ. 12,000 చెల్లిస్తారు.

ఉద్యోగ ఎంపిక విధానం: 

అభ్యర్థులను రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఒప్పంద కాల పరిమితి ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్లకు నాలుగు ఏళ్లు ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్లకు మొదట మూడేళ్ల కాలానికి తీసుకుంటారు. అవసరాన్ని బట్టి మరో ఏడాది పొడిగిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: 

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు: 

2026 మార్చి 10 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2026 మార్చి 24 దరఖాస్తుకు చివరి తేదీ.

దరఖాస్తు ఫీజు: 

అభ్యర్థులు రూ. 400 దరఖాస్తు రుసుముతో పాటు 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.

ALSO READ: Trending EV Cars March 2026: టయోటా To టాటా.. మార్చి 2026లో టాప్ ట్రెండింగ్ ఈవీ కార్లు ఇవే!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×