E-Paper
Advertisement

North Korea Trains: ఉత్తర కొరియా నుంచి ఆ దేశానికి రైళ్లు.. కిమ్ మామ నువ్వు మారిపోయావ్!

North Korea Trains: ఉత్తర కొరియా నుంచి ఆ దేశానికి రైళ్లు.. కిమ్ మామ నువ్వు మారిపోయావ్!
Advertisement

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు COVID-19 మహమ్మారి కారణంగా ఆరు సంవత్సరాలు చైనాకు రైలు సేలను నిలిపివేశారు. కోవిడ్ పుట్టింది డ్రాగన్ కంట్రీలోనే కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఆ దేశం నుంచి రైళ్ల రాకపోకలను క్యాన్సిల్ చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి దాదాపు కనుమరుగు అయిన నేపథ్యంలో రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

ఆరేళ్ల విరామం అనంతరం..

సుమారు ఆరేళ్ల విరామం తర్వాత ప్యోంగ్యాంగ్, బీజింగ్ మధ్య ప్రయాణీకులకు రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వారంలోనే రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమవుతున్నాయి. రెండు దేశాల మధ్య వారానికి నాలుగు సార్లు రైళ్లు నడవనున్నాయి. ప్రారంభంలో దౌత్యవేత్తలు, అధికారులను ఈ రైళ్లు తీసుకెళ్తాయి. సీట్లు అందుబాటులో ఉంటే ప్రజలు వెళ్లే అవకాశం ఉంటుంది. ఉత్తర కొరియా ప్రధాన ఆర్థిక భాగస్వామితో కనెక్టివిటీని పునరుద్ధరించడంలో తమ దేశానికి లాభం కలుగుతుందని కిమ్ భావిస్తున్నారు.

రైలు సర్వీసుల ప్రారంభంపై నార్త్ కొరియా కీలక ప్రకటన

Advertisement

ప్యోంగ్యాంగ్- బీజింగ్ మధ్య రైలు సేవలు ఈ వారంలో తిరిగి ప్రారంభమవుతాయని నార్త్ కొరియా తెలిపింది. 2020 ప్రారంభంలో ప్రారంభమైన కోవిడ్-19 ఆంక్షలతో  ప్రారంభమైన సరిహద్దు మూసివేతల తర్వాత, ఈ పునఃప్రారంభం ఉత్తర కొరియా, దాని ఆర్థిక మిత్రదేశానికి మధ్య కీలకమైన రవాణా సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది. ప్యోంగ్యాంగ్-బీజింగ్ రైలు మార్చి 12న రౌండ్-ట్రిప్ సర్వీసును ప్రారంభిస్తుందని, వారానికి నాలుగు సార్లు ఈ రైలు సర్వీసులు ఉంటాయని చైనా స్టేట్  రైల్వే ప్రకటించింది.

వారికి చివరి రెండు బోగీలు మాత్రమే!

ఈ రైళ్ల ప్రారంభ సమయంలో చివరి రెండు బోగీలు మాత్రమే ప్రయాణీకులను తీసుకెళ్లనున్నాయి. మిగతా బోగీల్లో  దౌత్యవేత్తలు, అధికారిక వ్యాపారవేత్తలను తీసుకువెళతాయి. సీట్లు అందుబాటులో ఉంటే సాధారణ ప్రజలు టిక్కెట్లు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తామని యోన్‌ హాప్ రైల్వే అధికారులు తెలిపారు. అటు ఉత్తర కొరియా తమ పర్యాటక ప్రాంతాలను కూడా మూసి వేసింది.  పరిమిత ఏర్పాట్లతో రష్యన్ టూర్ గ్రూపులకు పరిమిత మినహాయింపులు ఉన్నాయని ఆ దేశానికి ప్రయాణాలను నిర్వహించే ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి.

Advertisement

Read Also: ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్.. దీని లోపల ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతం అంతే!

ప్యోంగ్యాంగ్ మారథాన్‌ క్యాన్సిల్

కోవిడ్ మహమ్మారికి ముందు, ఉత్తర కొరియాకు విదేశీ పర్యాటకులలో చైనా సందర్శకులు అత్యధికంగా ఉండేవారు. అటు వచ్చే నెలలో జరగాల్సిన ప్యోంగ్యాంగ్ మారథాన్‌ ను ఉత్తర కొరియా రద్దు చేసింది. కారణాలు ఏంటనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.  మరథాన్ క్యాన్సిల్ అయినట్లు మాత్రం అధికారికంగా ప్రకటించింది.

Read Also: గంటకు 400 కిమీ వేగంతో దూసుకెళ్లే రైలు.. పరుగుకు సిద్ధం, ప్రపంచంలోనే ఫాస్టెస్ ట్రైన్ ఇది!

Related News

విదేశాల్లో పెళ్లిళ్లు వద్దంటూ పిలుపునిచ్చిన మోదీ.. ఇండియాలో సెలెబ్రిటీ వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఇవే

అమరావతి ఓవైపు.. ఫ్యూచర్ సిటీ మరోవైపు.. దక్షిణ భారత ముఖచిత్రాన్ని మార్చబోతున్న రెండు మెగా నగరాలు!

రాత్రి 9 తర్వాత నో ఎంట్రీకి చెక్.. శ్రీశైలానికి 24/7 రూట్ క్లియర్!

కారు, మెట్రో కాదు.. ఇంటికి వెళ్లాలంటే నదిలో దూకాల్సిందే!

నేపాల్ వరదల్లో నమ్మశక్యం కాని ఘటనలు.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన 6 అద్భుతాలు..!

ఒకే బిల్డింగ్‌లో ఊరంతా.. ఈ వింత చూస్తే షాక్ అవ్వాల్సిందే!

గాల్లో తేలే పుస్తకాలు.. చుట్టూ అద్దాల మాయ.. ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఫ్యూచరిస్టిక్ లైబ్రరీ!

27 సార్లు గర్భం.. 69 మంది పిల్లలు.. ప్రపంచంలోనే ఎక్కువ మంది పిల్లల్ని కన్న తల్లి ఈమే!

Big Stories

Advertisement
×