E-Paper
Advertisement

అసెంబ్లీలో కుస్తీ పోటీలు వద్దు.. మడతపెట్టి కొట్టేవాళ్లు మా దగ్గరా ఉన్నారు.. రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

అసెంబ్లీలో కుస్తీ పోటీలు వద్దు.. మడతపెట్టి కొట్టేవాళ్లు మా దగ్గరా ఉన్నారు.. రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో : బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం సభలో సరిగ్గా లేదని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సభలోని సీసీకెమెరాల్లోనూ రికార్డు అయిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా దళిత ఎమ్మెల్యే పట్ల కౌశిక్ రెడ్డి అవమానించారన్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తనను సమర్థిస్తే అసెంబ్లీ లో కత్తిపోట్లు జరుగుతాయన్నారు.

కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీ

కౌశిక్ రెడ్డి ప్రవర్తనను సూమోటుగా తీసుకొని ఎథిక్స్ కమిటీ ఆధారంగాచర్యలు చేపడతామన్నారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారమే చర్యలు తీసుకోవాలని సీఎం స్పీకర్ ను కోరారు. కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని కేటీఆర్, హరీష్​ రావు సమర్ధిస్తారా? అంటూ సీఎం ఫైర్ అయ్యారు. కడియం నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా, అనుభవజ్ఞుడిగా, చదువుకున్న వ్యక్తి కడియం శ్రీహరి అంటూ కొనియాడారు. కౌశిక్ రెడ్డి నిర్లక్ష్​యంపై అసెంబ్లీ తీర్మానం చేసిందని, తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనని సీఎం నొక్కి చెప్పారు.

బీఆర్ఎస్ బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదు

బీఆర్ ఎస్ బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదని సీఎం క్లారిటీ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారు ప్రస్తుతం ఫిరాయింపుల నినాదాలు ఇవ్వడం విచిత్రంగా ఉన్నదని సీఎం వివరించారు. తన, డిప్యూటీ సీఎం ముందు ఇలాంటి బెదిరింపులు పనికిరావన్నారు. దుష్ట సంప్రదాయానికి తెరలేపిన బీఆర్ ఎస్ పై సీరియస్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని సీఎం చెప్పారు.ఉప ముఖ్యమంత్రి, మిత్రుడు భట్టి విక్రమార్క అపారమైన విజ్ఞానవంతులని, చదువులో, లోతైన జ్ఞానంలో ఆయన నిష్ణాతులని కొనియాడారు. గత బీఆర్ఎస్ పాలకులందరికంటే అత్యంత తెలివైన నాయకుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అని సీఎం అభినందనలు తెలిపారు.

భట్టి పోరాటం వెలకట్టలేనిది..

గత ప్రభుత్వ హయాంలో భట్టి సీఎల్పీ నాయకుడిగా ఉన్నప్పుడు, ఆయన మేధస్సును చూసి అప్పటి పాలకులు భయపడ్డారని సీఎం వెల్లడించారు. ఎక్కడ వారి తప్పులను ఎండగడతారో, ఎక్కడ ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతాయో అన్న భయంతో ఆయన స్థాయిని తగ్గించేలా ప్రవర్తించారన్నారు. కానీ భట్టి ఎక్కడా వెనకడుగు వేయలేదన్నారు. సెంబ్లీలో గొంతు నొక్కాలని చూస్తే ఆయన ప్రజల్లోకి వెళ్లారన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా వేల కిలోమీటర్ల మేర ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర చేపట్టారన్నారు. రాష్ట్రంలో ‘ప్రజా పాలన’ సాకారం కావడానికి భట్టి గ పోరాటం, ఆయన పడ్డ శ్రమ వెలకట్టలేనివన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం భట్టి విక్రమార్క అత్యుత్తమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారన్నారు. దాన్ని చూసి ఓర్వలేక, అంశాలవారీగా చర్చించే దమ్ము లేక ప్రతిపక్షాలు ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అత్యంత హేయమైన చర్యగా సీఎం వివరించారు. డిప్యూటీ సీఎం లాంటి సమర్థుడిపై చేసే విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనంగా సీఎం సూచించారు.

కేసీఆర్ తో రాజీనామా చేయించాలి

ప్రజలిచ్చిన పాత్రను పోషించలేని స్థితిలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నారని సీఎం మండిపడ్డారు. దాదాపు ఇప్పటి వరకు కోటి రూపాయలకు పైగా జీతభత్యాలు తీసుకొని అసెంబ్లీకి హాజరు కావట్లేదన్నారు. ప్రజలు, ప్రభుత్వాలు అంటే ఆయనకు లేక్కలేదన్నారు. ఫామ్ హౌజ్ లో కూర్చొని ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారని, ఇది ప్రజాధనం వృథానే అంటూ సీఎం వెల్లడించారు. తమ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పడం కంటే ముందుగా సభకు రానందున కేసీఆర్ తో రిజైన్ చేయించాలని సీఎం నొక్కి చెప్పారు.

బీఆర్‌ఎస్ డిమాండ్లపై సీఎం కౌంటర్

తమ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తూ దళితులు, ఆదివాసీలు, గిరిజనుల కన్నీళ్లు తుడుస్తున్నారన్నారు. రోజులో దాదాపు 18 గంటల పాటు పనిచేస్తూ ప్రజా ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పేదల కష్టాలు తీర్చేందుకు పనిచేస్తుంటే పర్సనల్ ఎటాక్ చేయడం సరికాదన్నారు. బీఆర్ ఎస్ నేతల పనులు, ఫైళ్లు క్లియర్ చేయడం లేదని మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సరికాదని సీఎం చెప్పారు. బీఆర్ ఎస్ నేతలు ఏం చేసినా.. మంత్రి పొంగులేటి తో రాజీనామా చేయించలేమని సీఎం చెప్పారు.

కండలు తిరిగిన వాళ్లు మా దగ్గరా ఉన్నారు..

ఇక కండలు తిరిగిన లీడర్ల తమ దగ్గరా ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కండలు కంటే అత్యధికంగా ఉన్నాయని, ఒక్క దెబ్బతో మడ్తా పెట్టి కొట్టే సామార్థ్యం ఉన్నదన్నారు. కానీ ఇది అసెంబ్లీ అని, కుస్తీల పోటీలు కావని సీఎం విమర్శించారు. కొందరు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఆ తరహాలో వ్యవహరించడం సరికాదన్నారు. తాము అసెంబ్లీలో ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ వేదికను కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కొరకే వినియోగించుకోవాలన్నారు. రాజకీయాలకు ఇతర ప్లాట్ పామ్ లు ఉన్నాయని, సభ సమయం వృథా చేయడం సరికాదన్నారు. బీఆర్ ఎస్ వ్యవహరాన్ని రాష్​ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, త్వరలో మళ్లీ బుద్ధి చెప్తారని సీఎం నొక్కి చెప్పారు.

Also Read: బ్లాక్‌మెయిల్ చేసి పార్టీలో చేర్చుకున్నారు.. హౌస్ కమిటీల అసలు గుట్టు విప్పిన భట్టి విక్రమార్క!

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×