E-Paper
Advertisement

Revanth Reddy : ఇప్పుడు రైతుబంధు తీసుకోండి.. జనవరిలో రైతులకు మరో గిఫ్ట్ ఇస్తాం..

Revanth Reddy :  ఇప్పుడు రైతుబంధు తీసుకోండి.. జనవరిలో రైతులకు మరో గిఫ్ట్ ఇస్తాం..
Advertisement

Revanth Reddy : రైతుబంధు నిధుల విడుదల అంశం తెలంగాణ ఎన్నికల్లో కీలకంగా మారింది. ఎప్పుడో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నా.. కేసీఆర్ ప్రభుత్వం ఆ పని చేయలేదు. తొలుత ఈ నెపాన్ని కాంగ్రెస్ పై పెట్టే ప్రయత్నం చేసింది. ఈసీకి ఫిర్యాదు చేసి కాంగ్రెస్ నేతలే రైతుబంధును అడ్డుకుంటున్నారని ఆరోపించింది.

కాంగ్రెస్ మాత్రం రైతుబంధు ఇస్తే తమ పార్టీకి అభ్యంతరం లేదని తేల్చిచెప్పింది. వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరింది. తాము ఈసీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ఫిర్యాదుపై ఆధారాలుంటే చూపాలని సవాల్ చేసింది. దీంతో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయిపోయారు. ఆ అంశాన్ని ప్రస్తావించడం మానేశారు. కాంగ్రెస్ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న సమయంలో రైతుబంధు నిధులను రైతు ఖాతాల్లో జమ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది.

Advertisement

రైతులను ప్రభావితం చేసేలా పోలింగ్‌కు 4 రోజుల ముందు రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతివ్వడంపై రేవంత్‌రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు ముందుగానే విడుదల చేయాలని కాంగ్రెస్‌ కోరినా ఈసీ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు అనుమతి ఇవ్వడం వెనుక కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందన్నారు. దీంతో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే అని రుజువైందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇప్పుడు రైతుబంధు నిధులు విడుదల చేయడం వల్ల రైతులకు 5 వేల రూపాయల నష్టం జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి. రైతుబంధు డబ్బులు అకౌంట్లో పడ్డాయని రైతులు ప్రభావితం కావొద్దని సూచించారు. కాంగ్రెస్‌ వస్తే మరో 5 వేలు ఎక్కువ వచ్చేవి కదా? అని రైతులు బాధపడొద్దన్నారు. ఇప్పుడు కేసీఆర్‌ ఇచ్చే 5 వేలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక జనవరిలో ఇవ్వాల్సినవి ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

కేసీఆర్‌ను జేసీబీలు, క్రేన్లు పెట్టి లేపాలని మోదీ ప్రయత్నించినా ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవదని రేవంత్‌ రెడ్డి తేల్చిచెప్పారు. ఏకే గోయల్ ఇంటి నుంచి రూ.1000 కోట్లు పంచారని కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఈవో వికాస్‌రాజ్‌ కు తాము ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలేదన్నారు.

కాంగ్రెస్‌ నేతలనే టార్గెట్‌ చేసి ఐటీ దాడులు చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ఈడీ, ఐటీ కేవలం కాంగ్రెస్ నేతల ఇళ్లలో సోదాలు చేసేందుకే ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ బీజేపీ, బీఆర్ఎస్‌తో కాదని ఈడీ, ఐటీతోనేనని స్పష్టం చేశారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×