BigTV English

Fly in Man Intestines : వృద్ధుడి పేగుల్లో ఈగ.. షాక్ అయిన డాక్టర్లు

Fly in Man Intestines : వృద్ధుడి పేగుల్లో ఈగ.. షాక్ అయిన డాక్టర్లు
Fly in Man Intestines

Fly in Man Intestines : అరవై ఏళ్లు దాటిన వారు కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవడం రొటీన్. అమెరికాలోని మిసోరీకి చెందిన 63 ఏళ్ల వ్యక్తి అలాగే చెకప్ కోసం వెళ్లాడు. ఆయనను పరీక్షించిన వైద్యులు విస్తుపోయారు. పెద్దపేగుల్లో ఒక ఈగ చెక్కుచెదరకుండా ఉండటం వారిని విస్మయం పరిచింది. అసలది అక్కడకు ఎలా చేరిందో వారికి అర్థం కాలేదు.


కొలనోస్కోపీ పరీక్ష మొదలంతా సవ్యంగానే సాగింది. కోలన్ మధ్య భాగానికి వెళ్లే సరికి యూనివర్సిటీ ఆఫ్ మిసోరీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెద్దపేగు పై భాగంలో వంపు వద్ద చెక్కుచెదరకుండా ఉన్న ఈగను గుర్తించారు.

కొలనోస్కోపీ పరికరంతో దానిని అటూ ఇటూ కదిల్చే ప్రయత్నం చేశారు. ఈగలో చలనమేదీ లేకపోవడంతో చనిపోయినట్లు గ్రహించారు. అసలా ఈగ శరీరంలోకి ఎలా ప్రవేశించిందో, కడుపులోని జీర్ణ రసాలు, జీర్ణ ప్రక్రియకు తట్టుకుని ఎలా చెక్కుచెదరకుండా ఉందో అర్థం కాక తలలు పట్టుకున్నారు.


మలద్వారం ద్వారా పెద్దపేగుకు చేరే అవకాశాలు లేనే లేవని యూనివర్సిటీ ఆఫ్ మిసోరీ చీఫ్ గాస్ట్రోఎంటరాలజిస్ట్ మాథ్యూ బెక్టోల్డ్ చెప్పారు. మనం తినే ఆహారం ద్వారా ఈగ గుడ్లు, లార్వా పేగుల్లోకి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అత్యంత అరుదుగా కడుపులోనే అవి ఈగలుగా మారొచ్చని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఉద్ఘాటిస్తోంది.

ఈ కేసు అరుదైనదే అయినా.. వైద్య చరిత్రలో ఇలాంటివే మరికొన్ని కూడా ఉన్నాయి. ఇటీవల తైవాన్‌కు చెందిన ఓ మహిళ చెవి నుంచి సాలీడును వైద్యులు వెలికితీశారు. చిన్నపిల్లలైతే గొంతు, ముక్కు, చెవి ద్వారా వస్తువులేవైనా లోపలకి చేరిన దృష్టాంతాలు ఎన్నింటినో మనం చూసే ఉంటాం.

Related News

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Big Stories

×