Khammam Ministers | తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు అరుదైన గౌరవం లభించింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి.
Khammam Ministers | తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు అరుదైన గౌరవం లభించింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. గురువారం నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఖమ్మం జిల్లా నుంచి ఉపముఖ్యమంత్రిగా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రమాణ స్వీకారం చేశారు.
గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఖమ్మం జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడు సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు మ్మెల్యేలకు మంత్రి పదవులు లభించాయి. అప్పుడు పాలేరు నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే సంభాని చంద్రశేఖర్, కొత్తగూడెం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే వనమా విశ్వేశ్వరరావులు మంత్రులుగా పనిచేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటివరకు మంత్రులుగా పనిచేసిన వారి జాబితాలో శీలం సిద్ధారెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, జలగం వెంగళరావు, జలగం ప్రసాదరావు, సంభాని చంద్రశేఖర్, కోనేరు నాగేశ్వరావు, రాంరెడ్డి వెంకట్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు.