E-Paper
Advertisement

CM Revanth Reddy Gumlapur: కరీంనగర్ సాక్షిగా సోనియా గాంధీ మాట ఇచ్చారు.. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Gumlapur: కరీంనగర్ సాక్షిగా సోనియా గాంధీ మాట ఇచ్చారు.. ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy Gumlapur: కరీంనగర్ జిల్లా గుమ్లాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. 2004లో ఇదే కరీంనగర్ గడ్డపై సోనియా గాంధీ నిర్వహించిన సభ తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలక మలుపని ఆయన పేర్కొన్నారు. ఆనాడు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి వంటి నేతలు తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీకి కళ్లకు కట్టినట్లు వివరించారని, దానితో ప్రభావితమైన ఆమె “తెలంగాణ ఇచ్చి తీరుతాం” అని ఇక్కడే మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని కోల్పోయినా, కేంద్రంలో అధికారం పోయే ప్రమాదం ఉన్నా, పెట్టుబడిదారుల నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా మడమ తిప్పని నాయకురాలిగా సోనియా గాంధీ 2014లో స్వరాష్ట్రాన్ని అందించారని కొనియాడారు.

తెలంగాణ సాధనలో పార్లమెంట్‌లో పొన్నం ప్రభాకర్ వంటి నేతలు పెప్పర్ స్ప్రేలను సైతం ఎదుర్కొని నిటారుగా నిలబడి పోరాడారని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే, రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలు రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే.. కేసీఆర్ ప్రభుత్వం ఆ అవకాశాన్ని కేవలం ఆస్తులు కూడబెట్టుకోవడానికే వాడుకుందని విమర్శించారు. పదేళ్లలో రూ. 20 లక్షల కోట్ల ఆదాయం వచ్చినా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని, దళితులకు మూడెకరాల భూమి హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని పనిని, గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో సోనియా గాంధీ నాయకత్వంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి కాంగ్రెస్ నిరూపించిందని ఆయన వివరించారు.

Advertisement

రైతుల సంక్షేమం గురించి మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ పథకం కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం ఉచిత కరెంటుపైనే చేశారని, 1300 కోట్ల బకాయిలు రద్దు చేసి రైతులపై ఉన్న క్రిమినల్ కేసులను ఎత్తివేశారని గుర్తు చేశారు. ఇవాళ దేశమంతా ఉచిత కరెంటు గురించి మాట్లాడుతోందంటే అది కాంగ్రెస్ వేసిన పునాదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంక్షేమ పాలన అందిస్తుంటే, ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారని, పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చేయని వారు ఇప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచేటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

Related News

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

Big Stories

Advertisement
×