E-Paper
Advertisement

Revanth Reddy: రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభం

Revanth Reddy: రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభం
Advertisement

Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. మేడారం సమ్మక్క సారక్క ఆలయంలో పూజలు చేసి.. యాత్రను ప్రారంభించారు. గద్దెలపై కొలువున్న అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తులాభారంతో తన బరువుతో సమానమైన బంగారాన్ని దేవేరులకు సమర్పించుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, పార్టీ పెద్దల సమక్షంలో పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ కు పార్టీ శ్రేణులు అడుగడుగునా నీరాజనం పలికారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా.. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టారు. సుమారు రెండు నెలల పాటు రేవంత్ రెడ్డి జనంలో ఉండనున్నారు. పాదయాత్రలో భాగంగా.. జనం సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ పనితీరును ఎండగట్టడంతో వారికి మరింత దగ్గరయ్యేందుకు ఈ యాత్ర చేపట్టారు. ఇవాళ మేడారం నుంచి రామప్ప వరకు తొలిరోజు పాదయాత్ర సాగనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పాదయాత్ర కోసం భారీ ఏర్పాట్లు చేసింది. ఇటు పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Tags

Related News

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×