Revanth Reddy comments(Breaking news updates in telangana): రేవంత్‌రెడ్డి సంచలన విషయాలు చెప్పారు. సీఎం కేసీఆర్ చేయించిన లేటెస్ట్ సర్వే సమాచారం తన దగ్గర ఉందని చెప్పారు. ఆ సర్వేలోని అనేక ఆసక్తికర విషయాలు మీడియాకు వివరించారు.
గజ్వేల్‌లో కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని.. ఈసారి గులాబీ బాస్ ఓటమి ఖాయమని చెప్పారు రేవంత్‌రెడ్డి. ఆ సర్వే భయంతోనే కేసీఆర్.. గజ్వేల్‌లో పోటీ చేస్తానని చెప్పడం లేదని అన్నారు. అసలు కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తారో ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదని.. ఏ సభలోనూ ఆ విషయం ప్రస్తావించడం లేదని.. అందుకు ఓటమి భయమే కారణమని చెప్పారు. సిద్ధిపేటలోనూ బీఆర్ఎస్ గెలుపు డౌటేనన్నారు.
ఇక కేసీఆర్ దగ్గరున్న సర్వే రిపోర్టు ప్రకారం.. 80 మంది సిట్టింగులకు ఈసారి ఓటమి తప్పదని తేలిందని రేవంత్ తెలిపారు. అందుకే సిట్టింగులు అందరికీ సీట్లు ఇస్తానని కేసీఆర్ అనడం లేదని చెప్పారు. దమ్ముంటే.. గతంలో మాదిరే ఈసారి కూడా సిట్టింగులకే టికెట్లు అని ప్రకటించాలని డిమాండ్ చేశారు రేవంత్‌రెడ్డి. ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల్లో 80 మందికి ఓటమి తప్పదని సర్వే నివేదికలు చెబుతున్నాయని అన్నారు.