E-Paper
Advertisement

Revanth Reddy : కేసీఆర్, హరీష్ రావు కుట్రల వల్లే రైతుబంధు బంద్.. రైతులను మేమే ఆదుకుంటాం..

Revanth Reddy : కేసీఆర్, హరీష్ రావు కుట్రల వల్లే రైతుబంధు బంద్.. రైతులను మేమే ఆదుకుంటాం..
Advertisement

Revanth Reddy : కేసీఆర్ అల్లుడు హరీష్ రావు నిర్వాకం వల్లే రైతుబంధు ఆగిపోయిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డోర్నకల్ లో కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ అతి తెలివితేటల వల్ల రైతు బంధు ఆగిపోయిందన్నారు. బీఆర్ఎస్ కుట్రల్ని ప్రజలు గుర్తించాలన్నారు. రైతులతోపాటు రైతు కూలీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎకరాకు 15 వేలు ఇస్తామని భరోసా ఇచ్చారు. రైతు బంధు ఆగిపోవడానికి కారణమైన కేసీఆర్, హరీష్ రావును ఓడించాలని పిలుపునిచ్చారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని పేర్కొన్నారు. డోర్నకల్ లో జాటోత్ రామచంద్రు నాయక్ ను 25 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Advertisement

కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 10 వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని విమర్శించారు. లక్ష కోట్ల దోచుకున్నారని తెలిపారు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకెళ్లడం ఖాయమని తేల్చిచెప్పారు.

పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు అందిస్తామన్నారు. రైతలుకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో అమరవీరుల ఆశయాలు నెరలేదన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. అందుకే కేసీఆర్, కేటీఆర్ రాజకీయ ఉద్యోగాలు ఊడగొట్టాలని యువతను కోరారు. నిరుద్యోగులే కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులు ఒక్కొక్కరు 5 ఓట్లు వేయిస్తే.. కాంగ్రెస్ కు కోటి 50 లక్షల ఓట్లు వస్తాయని వివరించారు. అప్పుడు కాంగ్రెస్ కు 100 సీట్లు వస్తాయన్నారు. అధికారంలోకి వస్తే.. నిరుద్యోగులకు కొలువులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ దేనని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×