E-Paper
Advertisement

Revanth Reddy Tweet : కార్యకర్తల కష్టం, శ్రమ వృథా కాలేదు.. రేవంత్ రెడ్డి ట్వీట్..

Revanth Reddy Tweet : కార్యకర్తల కష్టం, శ్రమ వృథా కాలేదు.. రేవంత్ రెడ్డి ట్వీట్..
Advertisement
Revanth Reddy latest news

Revanth Reddy Tweet(Telangana congress news today):

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన అందరికీ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు TPCC చీఫ్‌ రేవంత్‌రెడ్డి. నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు.. ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాల అంటూ రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

గత పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు భయపడకుండా.. కాంగ్రెస్ చేసిన పోరాటంలో అందరూ ప్రజల పక్షాన నిలిచారని ప్రశంసించారు. ఎవరి కష్టం, శ్రమ వృథా కాలేదని రేవంత్‌ రెడ్డి పోస్ట్‌ చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో అందరి పాత్రా మరువలేనిదన్నారు రేవంత్‌రెడ్డి.

Advertisement

మరోసారి రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించబోతుందంటూ వస్తున్న సర్వేల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో కాంగ్రెస్ 75కు పైగా సీట్లు గెలవబోతోందంటూ సర్వేలు కచ్చితమైన సంఖ్య ఇవ్వటంతో.. వరుసగా నేతలు.. రేవంత్‌ ఇంటికి వెళ్తున్నారు. పుష్పగుచ్చాల అందించి శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాంగ్రెస్ సీనియర్‌ నేత మల్లు రవి, మల్‌రెడ్డి రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పలువురు నేతలు.. రేవంత్‌ను కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు, శ్రేణుల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధించామని నేతలు చెబుతున్నారు. కొన్ని నెలలుగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఈ విజయంలో భాగస్వామ్యం ఉందన్నారు.

Advertisement

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×