BigTV English

Telangana : పట్టిస్తే రూ.4 కోట్లు.. పులులు vs వేటగాళ్లు..

Telangana : పట్టిస్తే రూ.4 కోట్లు.. పులులు vs వేటగాళ్లు..

Telangana : అడవికి రారాజు టైగర్. పులిని చూస్తే మనిషికి పైప్రాణాలు పైనే పోతాయి. అలాంటి క్రూర జంతువును కూడా చంపేస్తున్నారు వేటగాళ్లు. ఖరీదైన పులి చర్మం, గోళ్ల కోసం జంతువు కన్నా క్రూరంగా మారుతున్నాడు మనిషి. అందుకే, ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో పులులకు రక్షణ లేకుండా పోతోంది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే పులులు హతమవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.


పులి..బలి..

ఆసిఫాబాద్ పులుల కారిడార్ ప్రాంతం వేటగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారింది. 2024లో K 15, S 9 అనే రెండు పులులు దరిగాం అటవీ ప్రాంతంలో మరణించాయి. విషపూరితమైన పశువుల మాంసం తినడం ద్వారా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గతంలోనే ఇద్దరు రైతులు, ఒక బాలుడిని అరెస్టు చేశారు. తాజాగా ఈ నెల 14న రాత్రి వేటగాళ్ల ఉచ్చుకు కాగజ్ నగర్ డివిజన్ పెంచికల్ పేట రేంజ్‌లో మరో పులి బలైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


పులిని చంపిందెవరు?

ఈ నెల 15న ఉదయం తునికాకు సేకరణకు వెళ్లిన కూలీలు చనిపోయిన పులిని చూసి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న అధికారులు వెతకగా పులి కళేబరం కనబడలేదు. కానీ ఘటన స్థలానికి 400 మీటర్ల దూరంలో జంతువును పూడ్చిన ఆనవాళ్లు కనిపించాయి. అనుమానం వచ్చి తవ్వగా చర్మం, గోళ్ళు, దంతాలు లేకుండా ఉన్న జంతువు కళేబరం లభించింది. పోస్ట్ మార్టం నిర్వహించగా ఏడు నుంచి ఎనిమిది ఏళ్ళ ఆడ పులిగా నిర్ధారించారు.

ఐదుగురు వేటగాళ్లు..

పులి గోళ్లకు, చర్మానికి, పళ్లకు మంచి డిమాండ్‌ ఉండటంతో వేటగాళ్లు పులులను చంపేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా పెంచికల్ పేట రేంజ్‌లో వేటగాళ్ల ఉచ్చుకు బలైన పులి K8 పులేనా కాదా? అనేది అధికారులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. చర్మం లేకుండా ఉండటంతో పులిని గుర్తించడం అధికారులకు సవాల్‌గా మారింది. అనుమానితులు, గతంలో ఇలాంటి కేసుకు సంబంధం ఉన్న 40 మందిని అదుపులోకి తీసుకుని విచారించి.. ఐదుగురిని గుర్తించారు అధికారులు. వీళ్లను విచారించగా నిజాలు బయటకు వచ్చాయి. పులి అవశేషాలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పులులకు ఉచ్చు..

గతేడాది జనవరిలో కాగజ్ నగర్ మండలం షెర్కేపల్లి అటవీ ప్రాంతంలో K15, S9 రెండు పులులు మృతి చెందాయి. ఆడ పులి మృతి చెందడంతో మరో పులి జాడ కోసం అటవీ అధికారులు ట్రాకింగ్ బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఇదే క్రమంలో మృతి చెందిన పెద్ద పులి మృతదేహం లభించింది. ఆడ పులి మృతదేహం లభించిన ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే మరో పులి మృతదేహం లభించింది. పులుల మధ్య జరిగిన ఘర్షణలో పులి పిల్ల చనిపోయినట్లు మొదట అధికారులు భావించారు. అయితే వెంటనే మగపులి చనిపోవటం దానికి ఉచ్చు బిగిసి ఉండడంతో విషప్రయోగం జరిగినట్లు అధికారులు తేల్చారు.

పట్టిస్తే రూ.4 కోట్లు..

పులులను వేటగాళ్ల బారి నుంచి కాపాడుకోలేకపోవడం అధికారుల వైఫల్యమేననే విమర్శలు వస్తున్నాయి. పులుల కదలికలను ట్రాక్ చేయడానికి అటవీ శాఖ కెమెరా ట్రాప్లను సైతం ఉపయోగిస్తోంది. అయినా లోపం ఎక్కడుందో తెలియదుకానీ పులులు మాత్రం వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. అయితే వేటగాళ్లను పట్టుకునేందుకు సమాచారాన్ని అందించే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి.. ప్రభుత్వం సీక్రెట్ సర్వీస్ ఫండ్ ఏర్పాటు చేసి.. రూ.4 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

Related News

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

Big Stories

×