BigTV English

OTT Movie : లైఫ్ లో మరచిపోలేని స్టోరీ సామీ… కత్తిలాంటి కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : లైఫ్ లో మరచిపోలేని స్టోరీ సామీ… కత్తిలాంటి కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie  : ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరప్పా. ఎంగేజింగ్ స్టోరీతో, ఊహించని మలుపులతో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇలాంటి కథలు. అందుకే ప్రత్యేకంగా ఈ జానర్లో సినిమాలను చూడడానికి ఆసక్తి చూపించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అలాంటి మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? కథ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే 

సైకోపాతిక్ సీరియల్ కిల్లర్ జాంగ్ క్యుంగ్-చుల్ ఒక స్కూల్ బస్ డ్రైవర్. ఓవైపు చలి, మరోవైపు మంచు కురుస్తున్న రాత్రి… నడిరోడ్డుపై జాంగ్ జూ-యియోన్ అనే యువతిని చూస్తాడు. ఆమె కారు పంక్చర్ అవడంతో రోడ్డుపై ఆగి ఉంటుంది. ఆమెకు సహాయం చేస్తానని చెప్పి, క్యుంగ్-చుల్ ఆమెను కిరాతకంగా హత్య చేస్తాడు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, శరీర భాగాలను సమీపంలోని స్ట్రీమ్‌లో విసిరి వేస్తాడు. జూ-యియోన్ ఒక రిటైర్డ్ పోలీస్ చీఫ్ కుమార్తె, గర్భవతి. ఆమె నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (NIS) ఏజెంట్ అయిన కిమ్ సూ-హ్యూన్ (లీ బైంగ్-హన్)కు కాబోయే భార్య. జూ-యియోన్ హత్య గురించి తెలిసిన తర్వాత, సూ-హ్యూన్ తన జీవితాన్ని నాశనం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో రగిలిపోతాడు.


కేసు ఇన్వెస్టగేషన్ లో భాగంగా నలుగురు అనుమానితుల జాబితాను సేకరించి, ఒక్కొక్కరినీ విచారిస్తాడు. క్యుంగ్-చుల్ ఇంట్లో జూ-యియోన్ ఎంగేజ్‌మెంట్ రింగ్‌ దొరకడంతో, అతనే చంపాడనే విషయం కన్ఫామ్ అవుతుంది. కానీ సూ-హ్యూన్ క్యుంగ్-చుల్‌ను వెంటనే చంపడానికి బదులు, అతనితో ఒక విచిత్రమైన, హింసాత్మకమైన ఆటను ప్రారంభిస్తాడు. అతన్ని పట్టుకుని, హింసించి, విడుదల చేసి, మళ్లీ ట్రాక్ చేస్తాడు. ఈ “క్యాట్ అండ్ మౌస్” గేమ్ ద్వారా సూ-హ్యూన్ క్యుంగ్-చుల్‌ను శిక్షించడానికి తన మానవత్వాన్ని కోల్పోయి, ఒక రాక్షసుడిగా మారుతాడు.

ఇక క్యుంగ్-చుల్ ఒక క్రూరమైన, దయలేని హంతకుడు. అంత టార్చర్ ను అనుభవిస్తూ కూడా మరిన్ని నేరాలు చేస్తాడు. సినిమా ఒక షాకింగ్ క్లైమాక్స్‌తో ముగుస్తుంది. ప్రేక్షకులను ఆలోచింపజేసే ఆ షాకింగ్ క్లైమాక్స్ ఏంటి? అతను ఎందుకు సైకోగా మారాడు? చివరికి ఏమైంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే?

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సిరీస్ పేరు ‘ఐ సా ది డెవిల్’ ( I saw the devil). 2010లో విడుదలైన ఈ దక్షిణ కొరియా యాక్షన్-థ్రిల్లర్ ఫిల్మ్ కు కిమ్ జీ-వూన్ దర్శకత్వం వహించారు. లీ బైంగ్-హన్, చోయ్ మిన్-సిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. Amazon Prime Video, Netflix, JioCinema ఓటీటీలలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×