OTT Movie : క్రేజీ కొరియన్ సిరీస్ లు అంటే ప్రత్యేకంగా ఉండే అభిమానించే వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి కొరియన్ మూవీ లవర్స్ కోసమే ఈ సిరీస్. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపలేము అన్నట్టుగా ఉంటుంది ఈ సిరీస్. స్పోర్ట్స్, లవ్, కామెడీ కావలసినంత ఉన్న ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉందో చూసేద్దాం పదండి.
స్టోరీలోకి వెళితే
ఫుల్ ఎనర్జీగా ఉండే 18 ఏళ్ల అమ్మాయి సాంగ్ టియాన్. ఆమె తన తల్లి చదువుకున్న లియుయే స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఫిగర్ స్కేటింగ్ టీమ్ లో చేరాలని కలలు కంటుంది. ఆమె అద్భుతమైన స్కేటర్ అయినప్పటికీ, ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతుంది, దీని వల్ల ఆమె కలలు భగ్నమవుతాయి. అయినప్పటికీ ఆమె ఆశలను వదులుకోకుండా, యూనివర్సిటీలోని ఐస్ హాకీ టీమ్ లో చేరడానికి అబ్బాయిగా మారువేషం వేస్తుంది. ఎందుకంటే ఐస్ హాకీ టీమ్ అమ్మాయిలను రిక్రూట్ చేయదు. ఆమె తన పేరును “సాంగ్ టియాన్”గా మార్చుకొని, అబ్బాయిగా వేషం వేసి, ఆ టీమ్‌లో స్థానం కూడా సంపాదిస్తుంది.
అయితే ఆమె ప్లాన్‌లో ఒక సమస్య ఏర్పడుతుంది. వెన్ బింగ్ (డారెన్ చెన్) ఒక ప్రతిభావంతమైన ఐస్ హాకీ ప్లేయర్. అంతేకాదు అతను గతంలో ఆమెకు శత్రువుగా ఉన్న వ్యక్తి. వెన్ బింగ్‌కు ప్రోసోపాగ్నోసియా (ముఖాలను గుర్తించలేని సమస్య) ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా అతను సాంగ్ టియాన్ ముఖాన్ని స్పష్టంగా చూడగలడు. పైగా వీరిద్దరూ ఒకే డార్మిటరీలో రూమ్ మేట్స్‌గా ఉండవలసి వస్తుంది. మొదట్లో వీరిద్దరి మధ్య విరోధం ఉంటుంది. కానీ ఒకే టీమ్ లో ఆడడం వల్ల వారి శత్రుత్వం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. వెన్ బింగ్ సాంగ్ టియాన్ రహస్యాన్ని తెలుసుకుంటాడు. ఆ తరువాత హీరో ఏం చేశాడు? హీరోయిన్ కల నెరవేరిందా లేదా? వీరిద్దరి ప్రేమ కథ ఎక్కడిదాకా వెళ్ళింది? అసలు ఇద్దరి మధ్య ఉన్న శతృత్వం ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ సిరీస్ పై ఓ లుక్కేయండి.
ఏ ఓటీటీలో ఉందంటే?
ఈ సిరీస్ పేరు ‘మై యూనికార్న్ గర్ల్’ (My Unicorn Girl chinese series). 2020లో విడుదలైన ఈ చైనీస్ కామెడీ, స్పోర్ట్స్, యూత్ ఫుల్ డ్రామాలో చెన్ యావో, డారెన్ చెన్, లీ జియులిన్, అవో జియి, మా జెహాన్, డై యాకీ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో 24 ఎపిసోడ్లు ఉండగా, ప్రతి ఎపిసోడ్ 45 నిమిషాలు నడుస్తుంది. కాస్త ఓపికగా చూస్తే ఎంటర్టైన్మెంట్ పక్కా.
Read Also : దెయ్యాలంటే నమ్మని అమ్మాయికి చుక్కలు చూపించే ఆత్మ… గ్రిప్పింగ్ నరేషన్… ఊహించని ట్విస్టులు