Big Stories

KCR in Trouble : క్యూలో తలసాని.. వలసలు ఆపడానికి కేసీఆర్ హైరానా

KCR about BRS MLA’s(Political news in telangana): ఎర్రవల్లి ఫాం హౌస్ లో బుజ్జగింపుల పరంపర కొనసాగుతునే ఉంది. మధ్యలో మూడు రోజులు బ్రేక్ తీసుకున్న కేసీఆర్ మళ్లీ పార్టీ నేతలను బుజ్జగించడం మొదలుపెట్టారు. గపార్టీ వీడోద్దంటూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను , జడ్పీ చైర్మన్‌లను బతిమలాడుతున్నారు. ఆ క్రమంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని.. ఈ సారి 15 ఏళ్లు అధికారంలో ఉంటామని వారికి భరోసా ఇస్తుండటం విశేషం. అయితే ఆ మాటల మాంత్రికుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఎమ్మెల్యేలతో పాటుఇతర నేతలు కారు దిగేందుకు సిద్దం అవుతున్నారంట.

- Advertisement -

అధికారంలో ఉన్నప్పుడు నియంతలా వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్‌‌ను పవర్ పోయాక చోటుచేసుకుంటున్న పరిణామాలు బాగా టెన్షన్ పెడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఒక పక్క ఆయన హయాంలో జరిగిన అవకతవకలపై విచారణలు.. మరోవైపు వలసపోతున్న నేతలతో పార్టీ ఖాళీ అవుతుండటంతో ఆయన తెగ హైరానా పడిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ప్రతినిధులను ప్రగతి భవన్ మెట్లు తొక్కనివ్వని కేసీఆర్.. వారినితానే స్వయంగా ఫోన్లు చేసి ఫాం హౌస్ కు పిలిపించుకొని బతిమిలాడుకుంటున్నారు. 10 రోజుల నుండి పార్టీ ప్రజా ప్రతినిధులను ఫాంహౌస్‌కు పిలిపించుకుంటున్న ఆయన మధ్యలో మూడు రోజులు బ్రేక్ తీసుకుని మళ్లీ ఆ ప్రోగ్రాం షురూ చేశారు.

- Advertisement -

ఇప్పటికే కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి, ఫాంహౌస్‌కు పిలిపించుకుని తెగ బుజ్జగించారు. వారికి కూడా ఫ్యూచర్ మనదేనని భరోసా ఇచ్చారు. ఆయన అలా భరోసా ఇచ్చి అంతలా బతిమిలాడిన ఎమ్మెల్యేలు పార్టీలో కొనసాగుతున్నారా అంటే అదీ లేదు. చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్యను ఇలానే ఫాంహౌస్‌కు పిలిపించుకుని బుజ్జగించారు. మరుసటి రోజే యాదయ్య ఢిల్లి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. యాదయ్య పార్టీ మార్పుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కౌంట్ 39 నుంచి 32కి పడిపోయింది.

Also Read : కాంగ్రెస్‌లో చేరిన కేకే.. తిరిగి సొంత గూటికి బీఆర్ఎస్ ఎంపీ..

ఎమ్మెల్యేలను బుజ్జగించిన ఫలితం లేకపోతుండటంతో.. కేసీఆర్ మిగిలిన నాయకులనైనా కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్లను కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్‌‌కు పిలిపించుకుని మీటింగ్ పెట్టారు.. వారిని కుటుంబసమేతంగా ఆహ్వానించి విందు కూడా ఇచ్చారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చి.. ఈ సారి 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందని వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. పనిలోపనిగా కాంగ్రెస్ ‌ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్.. నెలన్నర క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దారుణాతిదారుణంగా ఓడిపోయింది. ఆ విషయం ఎవరికీ తెలియదన్నట్లు.. ఆయన 15 ఏళ్ల అధికారం చెప్తుండటంపై ఫాంహౌస్‌కి వెళ్లి వచ్చిన నేతలే సెటైర్లు విసురుతున్నారు.

ఉన్న ఎమ్మెల్యేలను కాపడుకోలేని కేసీఆర్.. అధికారంలోకి వస్తే 15 ఏళ్లు అధికారంలో ఉంటామని చెపుతుండటం హాస్యాస్పదంగా ఉందని పార్టీ నేతలే చిర్రుబుర్రులాడుతున్నారు. ఇప్పటికే 6 గురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి వచ్చారు. రానున్న రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారన్న టాక్ వినిపిస్తుంది. జులై 24 నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండటంతో..ఈ లోపే గ్రేటర్ హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నెల్ కూడా తీసుకున్నారంట.

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేరిక దాదాపుగా ఖాయమైందంట. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు అంతే సైలెంట్‌గా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారంట. అందుకోసం ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న అఖిలేష్ యాదవ్ తో మంతనాలు జరుపుతున్నారంట. తలసాని ప్రయత్నాలు ఫలిస్తే.. గ్రేటర్ లో కారు ఖాళీ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News