E-Paper
Advertisement

Sanjeeva Reddy : నేనే ఎమ్మెల్యే.. సంజీవ్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమేనా..?

Sanjeeva Reddy : నేనే ఎమ్మెల్యే.. సంజీవ్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమేనా..?
Advertisement

Sanjeeva Reddy : నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవాలన్నదే ఆయన లక్ష్యం. 2016 ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి, 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. మూడో ప్రయత్నంలో మాత్రంలో విజయం తనదేనన్న ధీమాతో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్ధి పట్లోళ్ల సంజీవ్ రెడ్డి. అందుకే గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.

నియోజకవర్గంలో ఎక్కడా చూసిన కాంగ్రెస్ ప్రభంజనమే కనిపిస్తోందని సంజీవ్ రెడ్డి అన్నారు.తెలంగాణ ఇచ్చిన సోనియాకు బహుమానంగా ఈసారి కాంగ్రెస్ విజయాన్ని ఇస్తామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే బంగారు తెలంగాణగా ఉందన్నారు.

Advertisement

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ లు కాంగ్రెస్ హయాంలోనే నిర్మించారని సంజీవ్ రెడ్డి అన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గానికి ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో అందరికీ మేలు జరుగుతుందని హామీ ఇచ్చారు.

నీళ్లు, నిధులు, నియమాకాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను, యువతను మభ్యపెట్టిందని సంజీవ్ రెడ్డి విమర్శించారు. 24 గంటల కరెంట్ ఎక్కడ ఇవ్వడంలేదన్నారు.
ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టడానికి రెడీ గా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.ఈ సారి నారాయణ్ ఖేడ్ లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు.

Advertisement

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×