E-Paper
Advertisement

Congress : కుంభకోణాలు సరే..ఆధారాలు ఎక్కడ హరీష్!

Congress : కుంభకోణాలు సరే..ఆధారాలు ఎక్కడ హరీష్!
Advertisement

రాష్ట్ర ప్రభుత్వం మీద బీఆర్ఎస్ సీనియర్లు అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.సర్కారు కొత్తగా ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించినా, స్కీం తీసుకొచ్చినా అందులో కుంభకోణం దాగుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేదా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అవినీతి ఆరోపణలు చేస్తుండటం గమనార్హం.కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేండ్లు గడుస్తోంది.ఇప్పటివరకు ఆరుగ్యారంటీలతో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్టులను రేవంత్ సర్కార్ ప్రారంభించింది.ఇందులో ప్రజా అవసరాలకు ఉపయోగపడే అనేక స్కీమ్స్ ఉన్నాయి.
అయినప్పటికీ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేయడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ప్రతి స్కీమ్‌పైనా ఆరోపణలు..

రేవంత్ సర్కార్ ఈ మధ్యకాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టింది.కొత్త ప్రాజెక్టులు సైతం ప్రారంభించింది. అందులో యంగ్ ఇండియా స్కూల్స్, భారత ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ పరిధిలో మూడు కార్పొరేషన్ల ఏర్పాటు, జిల్లాలో ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మెడికల్ కాలేజీలు, రీజినల్ రిండ్ రోడ్డు వద్దకు నగరంలోని పరిశ్రమలను తరలించడం.. అందుకోసం ప్రత్యేకంగా భూ కేటాయింపులు చేయడం, గాంధీ సరోవర్ ప్రాజెక్టు వంటివి చేపట్టింది. అయితే, ఈ ప్రాజెక్టుల్లో వేల కోట్ల కుంభకోణం దాగుందని బీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నది. కేవలం మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ సర్కార్ రూ.లక్ష కోట్లు ఖర్చుచేస్తున్నదని, అందులో వేల కోట్ల కుంభకోణం దాగున్నదని ఆరోపిస్తున్నది.

నాదర్ గుల్ భూములపై..

Advertisement

తాజాగా హైదరాబాద్ కేంద్రంగా రూ.7 వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించాారు. నాదర్ గుల్‌లోని దళితులకు చెందిన 374 ఎకరాల భూమిలో 600 మంది పేద రైతులు ఉన్నారని.. ఈ భూముల్లో కాంగ్రెస్ సర్కార్ పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నందని ఆరోపించారు. దళితులు, పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పుకుంటూ వారిని నిండా ముంచుతున్నారని.. రక్షించాల్సిన వారే భక్షకులు అయ్యారని హరీశ్ రావు మండిపడ్డారు. గత పాలకులు చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ పేదల భూములను పరిరక్షిస్తే రేవంత్ సర్కార్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు.

జగన్ ప్లాన్ మామూలుగా లేదుగా.. వైసీపీ నేతల ఆందోళనలు, అందుకేనా?

Advertisement

ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతల అక్రమాలను న్యాయస్థానంలో సవాల్ చేశామని.. ఇక ముందు కూడా పేదలకు అన్యాయం జరగనివ్వబోమని ఫైర్ అయ్యారు. ఇటీవల భూదాన్ భూముల్లోనూ కాంగ్రెస్ సర్కార్ ఇలాగే దౌర్జన్యం చేసి పేదల భూములను లాక్కోవాలని చూసిందని.. ప్రతిపక్ష పార్టీ తరఫున వారికి అండగా నిలబడటంతో సర్కారు దిగొచ్చని వెల్లడించారు. కాగా, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఆరోపణలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. ముందుగా ఆధారాలు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు చేయడం సులువే అని.. ఆధారాలు చూపకపోతే పరువు నష్టం దావా వేస్తామని కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీపై అసత్య కథనాలు, అబద్ధపు ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. లేదంటే కాంగ్రెస్ నేతల సత్తా ఏంటో చూపిస్తామని మండిపడుతున్నారు.

 

 

 

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×