Big Stories

Shakeel Son Case : కుమారుడి కేసు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ పై లుక్ అవుట్ నోటీస్..

Shakeel Son Case

Shakeel Son Case Hyderabad(Telangana news): పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత షకీల్‌పై కూడా లుక్ అవుట్ నోటీస్ జారీ అయింది. యాక్సిడెంట్ కేసులో తన కుమారుడు రాహిల్‌ను తప్పించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కుమారుడి కలిసి దుబాయ్‌కి పారిపోయారు. తండ్రీకొడుకులక సహకరించిన పంజాగుట్ట, బోధన్‌ సీఐలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదయ్యారు. ఇంకా ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

- Advertisement -

గతంలో షకీల్‌ కుమారుడిపై పంజాగుట్ట పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. పంజాగుట్టలో ర్యాష్ డ్రైవింగ్ చేసిన తొలుత ముంబైకి పారిపోయాడు. అక్కడి నుంచి దుబాయికి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. రాహిల్ ను రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

డిసెంబర్ 23నే బేగంపేట ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదం జరిగింది. రాహిల్ ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. అతడు ముగ్గురు యువతులను కారులో ఎక్కించుకున్నాడు విచారణలో తేలింది. అతివేగంతో కారు నడుపుతూ ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టాడని నిర్ధారించారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించారని నిర్ధారణ కావడంతో పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ దుర్గారావును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో సాగుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News