BigTV English

OnePlus 12R : వన్‌ప్లస్ 12R విక్రయాలు షురూ..

OnePlus 12R : వన్‌ప్లస్ 12R విక్రయాలు షురూ..
OnePlus 12R

Oneplus 12r online (daily news update):


ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ OnePlus 12R తొలి విక్రయాలు ఈ రోజు మన దేశంలో మొదలయ్యాయి. ఇటీవలే లాంచ్ చేసిన OnePlus 12R‌ మిడ్-ప్రీమియం స్మార్ట్‌ఫోన్. ఫోన్ ప్రియులు ఎన్నో రోజుల నుంచి దీని అమ్మకాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఒప్పో రెనో 11 ప్రో, పిక్సెల్ 7ఏ తదితర స్మార్ట్ ఫోన్లకు ధీటుగా దీని ఫీచర్లు ఉన్నాయి. వన్‌ప్లస్ 12ఆర్ బేస్ మోడల్ ప్రారంభ ధర రూ.39,999. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో ఈ మోడల్ అందుబాటులో ఉంది. వీటికి రెట్టింపు స్టోరేజ్‌తో కూడిన మరో వేరియంట్‌ను రూ.45,999 ధరకే పొందవచ్చు.

ఇవీ స్పెసిఫికేషన్లు..


ఈ డివైజ్ 6.78-అంగుళాల 10 బిట్ అమోల్డ్ ఎల్‌టీపీవో డిస్‌ప్లేతో 1264 x
2780 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. 4,500 నిట్స్
గరిష్ఠ బ్రైట్‌నెస్, 360హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 120హెచ్‌‌జెడ్ రిఫ్రెష్
రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. 11ఆర్‌తో
పోలిస్తే డిస్‌ప్లే మరింత ప్రకాశవంతమేనని చెప్పాలి. ఈ డివైజ్ అల్యూమినియం అల్లాయ్ మెటల్ మిడిల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది. క్వాల్ కామ్ స్నాప్
డ్రాగన్ 8 జెన్2 చిప్ సెట్ ఉన్నందు వల్ల మల్టీ టాస్కింగ్‌ను అతి
సునాయాసంగా చేసుకోవచ్చు. ఎలాంటి అవాంతరాల్లేని వీడియో
స్ట్రీమింగ్‌కు అవకాశాలే ఎక్కువున్నాయి. ఈ ఫోన్‌లోని మల్టిపుల్ ఫాంట్స్ కూడా కొనుగోలు దారులను విశేషంగా ఆకట్టుకునే చాన్స్ అధికం.

ఆప్టిక్స్, బ్యాటరీ విశేషాలు..

వన్‌ప్లస్ ఏస్ 3 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇందులోనూ ఏర్పరిచారు. ఎఫ్/1.8 లెన్స్, ఓఐఎస్‌తో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్890 ప్రైమరీ సెన్సర్, ఎఫ్/2.2 లెన్స్‌తో కూడిన 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సర్, ఎఫ్/2.4 లెన్స్‌తో 2ఎంపీ మాక్రో
కెమెరా ఈ ఫోన్‌లో ఉన్నాయి. 100డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌‌కు వీలుగా 5,500ఎంఎహెచ్ శక్తి గల బ్యాటరీని అందించారు.

Related News

iPhone 17 Hidden features: ఐఫోన్ 17లో రహస్య ఫీచర్లు.. మీకు తెలుసా?

Budget Phone Comparison: లావా బోల్డ్ N1 vs టెక్నో పాప్ 9 vs గెలాక్సీ M06..రూ.10000 లోపు ధరలో ఏది బెస్ట్?

Galaxy Flip: శామ్‌సంగ్ 50MP కెమెరా ఫ్లిఫ్ ఫోన్ పై భారీ తగ్గింపు.. సూపర్ డీల్‌ అదరహో

Youtube Multi Language: యూట్యూబ్‌లో కొత్త ఆడియో ఫీచర్.. ఇకపై వీడియోలు మీకు ఇష్టమైన భాషలో

Nano Banana Photo: ఘిబ్లీ మరిచిపోండి ఇప్పుడు ఇదే ట్రెండ్.. 3డీ ఫొటోలతో పిచ్చెకిస్తున్న నానో బనానా ఏఐ..

iPhone Air Comparison: ఐఫోన్ ఎయిర్ vs గెలాక్సీ S25 vs పిక్సెల్ 10.. ఏ ఫ్లాగ్ షిప్ ఫొన్ బెస్ట్?

Old Iphones Discontinue: ఐఫోన్ 17 లాంచ్ తర్వాత ఆపిల్ షాకింగ్ నిర్ణయం.. పాత ఐఫోన్‌ల విక్రయాలు బంద్!

Pixel 9 Discount: గూగుల్ పిక్సెల్ 9 పై సూపర్ డీల్.. 50 శాతానికి పైగా తగ్గింపు..

Big Stories

×