Big Stories

Road accident: చెట్టును ఢీకొన్న కారు.. ఎస్సై సహా ముగ్గురి మృతి..

Road accident in telangana

Road accident in telangana(Local news telangana): కారు చెట్టును ఢీ కొనడంతో ఎస్సైతో పాటు ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ వద్ద జాతీయ రమదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు.

- Advertisement -

మృతులను నంద్యాల జిల్లా ప్యాపిలి ఎసై వెంకటరమణ, ఆయన అల్లుడు పవన్ సాయి, డ్రైవర్ చంద్రగా గుర్తించారు పోలీసులు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ కుమార్తె అనూషను మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News