Big Stories

Bramayugam: ‘హను-మాన్‌’ తరహాలోనే ‘భ్రమయుగం’.. టికెట్ ధర తగ్గింపు

Bramayugam Ticket price reduced: మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన సినిమా ‘భ్రమయుగం’ మలమాళంలో విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా టికెట్‌ ధరలను తగ్గించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే రూ. 30కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ నేపథ్యంలో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.150 మల్టీప్లెక్స్‌లలో రూ.200లకు టికెట్‌ ధరను తగ్గించారు.

- Advertisement -

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను భారీగా అలరించిన చిత్రం ‘హను-మాన్‌’. ఈ సినిమా టికెట్ ధరను తగ్గించి మరింత మంది ప్రేక్షకులు థియేటర్లల్లోకి తీసురావలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో ‘భ్రమయుగం’ కూడా టికెట్‌ ధరను తగ్గించడం విశేషం.

- Advertisement -

‘భ్రమయుగం’ ఓ డార్క్‌ ఫాంటసి హారర్‌ మూవీ. ఈ సినిమా దర్శకుడు రాహుల్‌ సదాశివన్. మమ్ముట్టి ఈ సినిమాలో ప్రధన పాత్రను పోషించాడు. తెలుగు రాష్ట్రాల్లో మార్చి 23న ఈ సినిమా విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ మూవీని విడుదల చేస్తోంది. ఈ క్రమంలో టికెట్‌ ధరలను తగ్గించడం సినిప్రియులకు మంచి వార్తే అని చెప్పాలి.

Read More: బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ తరఫున ప్రచారం.. వరుణ్‌ తేజ్‌ క్లారిటీ..

అసలు మమ్మట్టి సినిమాకు ఒప్పుకోకపోతే ఈ సినిమానే తీసేవాడిని కదు అని దర్శకుడు సదాశివన్‌ తెలిపాడు. ఆయన చాలా హుందాగా కనిపించిన సినిమా సెట్‌లో మాత్రం సందడి చేస్తారు అన్నాడు. అయన సెట్‌లోకి రాగానే అంతా నిశ్వబ్దమైపోతుంది.. అయన తేజస్సు అలాంటిది అని చెప్పాడు. తనని తాను కొత్తగా చూపించుకునేందుకు ఆయన పాత్రకు తగినట్లు మారిపోతారు అన్నారు.

సినిమా అంతా ఓ పాడుబడిన ఇంటి చూట్టే తిరుగుతుంది.. ఆ ఇంట్టో కుడుమోన్‌ పొట్టి (మమ్ముట్టి) తన కుమారుడు ఉంటారు. ఆ ఇంట్లో చిక్కుకున్న జానపద గాయకుడు తప్పించుకుపారిపోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన తిరిగి అక్కడికే వస్తాడు. అసలు ఆ ఇంట్లో కుడుమోన్‌ ఎందుకు ఉంటాడు.. అతను ఎవరు అనే థ్రల్‌తో సినిమా ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News