E-Paper
Advertisement

ఫోటో కోసం పుస్తెల తాడు అడిగి పరార్.. 90 నిమిషాల్లో దొంగ అరెస్ట్!

ఫోటో కోసం పుస్తెల తాడు అడిగి పరార్.. 90 నిమిషాల్లో దొంగ అరెస్ట్!
Advertisement

Chain Theft: స్వేచ్ఛ బ్యూరో: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గురువారం మధ్యాహ్నం వృద్ధ మహిళకు అధికంగా పింఛను ఇప్పిస్తానని ఆమె మెడలో నుంచి బంగారం ఎత్తుకుపోయిన దొంగను సిసిఎస్, హుస్నాబాద్ పోలీసులు కేవలం 90 నిమిషాల్లోనే చేదించిన ఘటన విషయాలను హుస్నాబాద్ ఏసీబీ కార్యాలయంలో ఏసిపి ఎస్. సదానందం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుడైన అల్లెపు కృష్ణ అనే వ్యక్తి అయిలేని లక్ష్మీ (76) ని సమీపించి, ఆమెకు నెలకు రూ. 4,000 పెన్షన్ ఇప్పిస్తానని నమ్మించాడు.

చైన్ తీసుకొని పరార్..

హుస్నాబాద్ లోని గాయత్రి బ్యాంకులో ఎంతమంది ఉన్నారో చూసి వస్తానని చెప్పి బ్యాంక్ వద్దకు వెళ్లి వచ్చి బ్యాంకులో వేరే వ్యక్తికి ఫోటో గురించి పుస్తెలతాడు కావాలి, నువ్వు ఇస్తే ఫోటో దిగిన తర్వాత తెచ్చి ఇస్తానని చెబుతూ ఫిర్యాదురాలు అయిలేని లక్ష్మీ(76) మెడలో నుంచి దాదాపు రెండున్నర తులాల బంగారు చైన్ తీసుకొని పరారయ్యాడు. బాధితురాలి సమాచారం మేరకు హుస్నాబాద్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటన స్థలానికి స్థానిక ఎస్ఐ లక్ష్మారెడ్డి, కానిస్టేబుల్ నరేష్ చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ఇమేజ్ ను గుర్తించారు. వెంటనే సీసీఎస్ ఇన్స్పెక్టర్ పెండ్యాల దేవేందర్ వారి బృందం రంగంలోకి దిగి నేర స్థలములో ఉన్న సి సి ఫూటేజ్ ను విశ్లేసించి, కేవలం ఒకటిన్నర గంటల వ్యవధిలోనే హుస్నాబాద్ బస్టాండ్ వద్ద నిందితుడైన అల్లెపు కృష్ణను సీసీఎస్ పోలీసులు విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Also read: రేపు మేడ్చల్‌లో ‘ప్రజాపాలన ప్రగతి’ జాతర: కలెక్టర్ మను చౌదరి

అత్యంత వేగంగా..

ఈ కేసును హుస్నాబాద్ ఏసిపి సదానందము పర్యవేక్షణలో అత్యంత వేగంగా ఛేదించి, నిందితుడిని పట్టుకున్న, సీసీఎస్ ఇన్స్పెక్టర్ లు పెండ్యాల దేవేందర్, రవీందర్, సిసిఎస్ యస్ఐ తిరుపతి, హుస్నాబాద్ సీఐ కే. శ్రీనివాస్,ఎస్సై లక్ష్మారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, నగేష్ ,హుస్నాబాద్ కానిస్టేబుల్ నరేష్ లను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఐపీఎస్ అభినందించారు. దీనిని బట్టి సీసీ కెమెరాల ప్రాముఖ్యత ఎంతో ఉన్నదని అర్దమవు తున్నది. కావున ప్రజలందరు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడములో బాగాస్వామ్యము కావాలననని కోరడమైనది.

Advertisement

Also Read: రికవరీ ఏజెంట్ల ఆగడాలకు ఇక బ్రేక్.. నోరు జారితే చేతికి బేడిలే..?

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×