E-Paper
Advertisement

Mangli Case: నాకు పాడటమే వచ్చు.. స్కాంలు తెలియవు.. సింగర్​ మంగ్లీ ఆవేదన

Mangli Case: నాకు పాడటమే వచ్చు.. స్కాంలు తెలియవు.. సింగర్​ మంగ్లీ ఆవేదన
Advertisement

Mangli Case: తనకు పాటలు పాడటం మాత్రమే వచ్చని.. స్కాంలు చేయటం తెలియదని సింగర్ మంగ్లీ పేర్కొన్నారు. తాను తప్పు చేసినట్టు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంతో మానసికంగా నలిగిపోతున్నానని అన్నారు. డీజీపీ కార్యాలయానికి బుధవారం వచ్చిన ఆమె అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్​ భగవత్ కు ఈ మేరకు ఫిర్యాదు ఇచ్చారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంగ్లీ కోరారు.

అనంతరం డీజీపీ కార్యాయం వద్ద మీడియాతో మాట్లాడుతూ పేదరికం నుంచి వచ్చిన తనకు డబ్బు విలువ తెలుసు అని మంగ్లీ చెప్పారు. తనపై జరుగుతున్న ప్రచారంతో నెలరోజులుగా నా ప్రోగ్రామ్స్​, రికార్డింగులు అన్నీ వదులుకున్నానన్నారు. బాధితులకు అండగా ఉంటానని చెప్పారు. మధు నాయక్​, హిమాకాంత్ రెడ్డి, రామావత్ మధు, సిద్ధూ, న్యాయవాది సుబ్బారావులపై అదనపు డీజీకి ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిపారు.

Advertisement

Also Read: ఇష్టారీతిన డీమిలిటేషన్ చేస్తే.. ఊరుకునేదే లేదు.. కేంద్రానికి ఎంపీ చామల వార్నింగ్!

మంగ్లీ తరపు న్యాయవాది మాట్లాడుతూ తప్పు చేసిన వాళ్లే బాధితులుగా పోలీస్​ స్టేషన్​ కు వస్తున్నారని చెప్పారు. సుభాక్షేత్ర బిజినెస్​ అన్న పేరుతో కంపెనీని ఏర్పాటు చేసింది.. దానికి ఎండీగా ఉన్నది మధు అని తెలిపారు. బాధితుడ్ని అని చెప్పుకొంటూ మీడియాతో మాట్లాడుతున్న హిమాకాంత్ రెడ్డి ఆ కంపెనీకి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా ఉన్నట్టు చెప్పారు. జరిగిన మోసంతో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపితే నిజానిజాలు అన్నీ బయటకు వస్తాయన్నారు.

Advertisement

Also Read: Vi Family Plan: వీఐ సర్‌ప్రైజింగ్ ప్లాన్.. అపరిమిత 5G డేటా, ఉచిత ఓటీటీలు.. 3000 SMSలు, ఫ్రీ కాల్స్!

Related News

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

Big Stories

Advertisement
×