Somireddy Law Group : హైదరాబాద్‌లోని కోకాపేటలో శుక్రవారం సోమిరెడ్డి లా గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన అమెరికాలోని భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న చట్టపరమైన సవాళ్ల అనే అంశంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చమల కిరణ్ కుమార్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ బోధి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి. చెన్నారెడ్డి, టీపీసీసీ సీనియర్ నాయకుడు పొట్టిగారి నరసింహ రెడ్డి, తెలంగాణ అడ్వొకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డి, ఐపీఎస్ ఇంటెలిజెన్స్ ఎస్పీ ముత్యం రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ ఈవెంట్‌లో సోమిరెడ్డి లా గ్రూప్ వ్యవస్థాపకుడు సోమిరెడ్డి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి న్యాయ సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కోకాపేటలో తమ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను తమ సంస్థ చట్టపరంగా పరిష్కరించిందని ఆయన వివరించారు.
ట్రంప్ విధానాల కారణంగా విద్యార్థులను వారి దేశాలకు బలవంతంగా తిరిగి పంపే ప్రయత్నాలను అమెరికా ఫెడరల్ కోర్టులో సవాల్ చేసి, అనుకూల తీర్పు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పోరాటం ఫలితంగా ఒక్క భారతీయ విద్యార్థిని కూడా తిరిగి పంపలేకపోయారని, ఇది తమ సంస్థ సాధించిన కీలక విజయాల్లో ఒకటని ఆయన అన్నారు.
కక్షిదారులకు సులభమైన, నమ్మకమైన న్యాయ సేవలను అందించే లక్ష్యంతో కోకాపేటలోని తమ ఆఫీస్‌ను ఆధునిక సౌకర్యాలతో రూపొందించామని సోమిరెడ్డి సంతోష్ రెడ్డి, ఎల్లారెడ్డిగారి విజయ్ తెలిపారు. కార్పొరేట్, రియల్ ఎస్టేట్, కుటుంబ వివాదాలు, సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించిన సేవలను పూర్తి వృత్తిపరమైన విలువలతో అందిస్తామని వారు వెల్లడించారు.
కక్షిదారుల గోప్యతను కాపాడుతూ, నిజాయితీతో కూడిన న్యాయ సేవలను అందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఇలాంటి ఆధునిక న్యాయ కార్యాలయం ఇప్పటి వరకు లేదని, ఈ లోటును తాము పూరించామని ఆయన ప్రకటించారు. అన్ని రకాల చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ కార్యాలయం హైదరాబాద్‌లో న్యాయ సేవలకు కొత్త ఒరవడిని సృష్టిస్తుందని ఆయన తెలిపారు.