E-Paper
Advertisement

మరోసారి చిక్కుల్లో పడ్డ ‘ఇరుముడి’.. రవితేజ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్!

మరోసారి చిక్కుల్లో పడ్డ ‘ఇరుముడి’.. రవితేజ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్!
Advertisement

Irumudi Movie: ప్రముఖ స్టార్ డైరెక్టర్ శివా నిర్వాణ (Shiva Nirvana ) దర్శకత్వంలో రవితేజ (Raviteja) హీరోగా నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం ఇరుముడి. ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా వీకెండ్స్ తో సంబంధం లేకుండా హౌస్ ఫుల్ బోర్డులు పడుతూ డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. ముఖ్యంగా ఈ సినిమా ఏ రేంజ్ లో అయితే కలెక్షన్లు అందుకుంటోందో.. అదే రేంజ్ లో వివాదాలు కూడా ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై ఏపీ గవర్నమెంట్ టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినిమాలోని కొన్ని సన్నివేశాలను డిలీట్ చేయాలి అంటూ ఏకంగా మంత్రి నారా లోకేష్ కి కూడా వినతిపత్రం అందించిన విషయం తెలిసిందే.

మళ్లీ చిక్కుల్లో పడ్డ ఇరుముడి మూవీ..

ఈ ఘటన ఇంకా మరువకముందే ఇప్పుడు ఈ సినిమా మరోసారి చిక్కుల్లో పడింది. పైగా రవితేజ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్స్ చేస్తున్నారు . అసలు విషయంలోకెళితే.. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి.. సినిమాను మేము ఆలస్యంగా చూసాము.. గురుస్వాములకు కళంకం తెచ్చే విధంగా, వారి పవిత్రతను దెబ్బతీసేలా ఈ సినిమాను చిత్రీకరించారు అంటూ సమితి జనరల్ సెక్రటరీ మండిపడ్డారు..

Advertisement

also read:మొదలైన వార్.. కృష్ణుడు ఫైర్!

స్వామి పేరు పెట్టుకుని కమర్షియల్ అంశాలతో సినిమా చేశారు..

ఇరుముడి కట్టుకొని శబరిమలకు వెళ్తే స్వామివారు ఆ కుటుంబాన్ని కాపాడారు అనే విధంగా కాకుండా.. ఇరుముడి అని పేరు పెట్టుకుని కమర్షియల్ అంశాలతో క్రైమ్ నేపథ్యంలో సినిమా తీయడం చాలా బాధగా ఉంది. అయ్యప్ప స్వామి మీద తీసిన రెండు పాటలు కారణంగానే ఈ సినిమా అతిపెద్ద హిట్ అయింది. అయ్యప్ప స్వామి మాలను కేవలం మందు తాగే వాళ్ళు మాత్రమే వేస్తారని, దీక్ష ముగిసిన వెంటనే మళ్ళీ మద్యం సేవిస్తారు అనేట్టుగా ఈ సినిమాలో చూపించారు అంటూ సమితి సభ్యులు ఆరోపించారు. అయ్యప్ప స్వామి భక్తులు దీక్ష ధరించినా లేదా తీసివేసినా.. ఎప్పుడు మద్యం ముట్టుకోరు.. అందుకే వారి కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు

చిత్ర బృందం స్పందిస్తుందా?

Advertisement

ఇరుముడి టైటిల్ పెట్టుకొని ఇలాంటి చిత్రం తీసిన రవితేజ, దర్శక నిర్మాతలతో పాటు చిత్ర బృందం మొత్తం బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా మరొకవైపు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను, టీచర్లను అవమానించారని.. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాలను కించపరిచేలా సన్నివేశాలు చిత్రీకరించారని, వెంటనే వీటిని తొలగించాలి అంటూ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది . అయితే దీనిపై స్పందించిన శివానిర్వాన తాను కూడా టీచర్గా పనిచేశానని , ఇక్కడ ఎవరు ఎవరిని నెగిటివ్గా చూపించలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఇరుముడి సినిమా విడుదలై మూడవ వారమైనా ఇప్పటికీ వరుస వివాదాలు చుట్టు ముట్టడం బాధాకరం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Related News

మెగా ఫోన్ పట్టిన జయం రవి.. స్పందించిన కెనీషా!

మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్.. 24 గంటల డెడ్ లైన్ పెట్టిన మాధురి!

పవన్ కు హిట్ ఇచ్చా.. మహేష్ బాబు విషయంలో బాధపడుతున్న డైరెక్టర్?

సర్దార్ 2 కు 500 కోట్ల కలెక్షన్స్.. జోస్యం చెప్పిన మనోజ్.. అంతా కాన్ఫిడెన్స్ ఏంటీ బ్రో?

ది ప్యారడైజ్ వాయిదా వార్తలకు చెక్… విడుదలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’లోకి ఎన్టీఆర్ ఎంట్రీ?

రణబాలి టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్…ఈ సారి రక్తపాతమే!

Big Stories

Advertisement
×