E-Paper
Advertisement

Danam issue: దానం అనర్హత అంశం.. ఫిబ్రవరి 18న స్పీకర్ నిర్ణయం, వాయిదా వెనుక అసలు కారణమిదే

Danam issue: దానం అనర్హత అంశం.. ఫిబ్రవరి 18న స్పీకర్ నిర్ణయం, వాయిదా వెనుక అసలు కారణమిదే
Advertisement

Danam issue: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం. ఈ వ్యవహారంపై స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరిస్తారని పార్టీ భావించాయి. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గడువు కావాలని కోరండంతో దాఖలైన పిటిషన్‌పై విచారణ ఫిబ్రవరి 17కు వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్.

దానం నాగేందర్ అనర్హత అంశం

Advertisement

తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ వ్యవహారం సీరియల్ మాదిరిగా సాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టారు స్పీకర్ గడ్డ ప్రసాద్. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీకి హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు విచారణ చేపట్టారు.

దానం పార్టీ మారినట్టు నిరూపించే సాక్షాలను స్పీకర్‌కు అందజేశారు. వాటిని స్పీకర్ గడ్డం ప్రసాద్ క్షుణ్నంగా పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ విచారించాలని భావించారు. ఆయన హాజరుకాకుండా ఆయన తరపు న్యాయవాదులను పంపారు.  తాను స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాలంటే మున్సిపల్ ఎన్నికల పూర్తయ్యే వరకు గడువు ఇవ్వాలని కోరారు మహేశ్వర్ రెడ్డి.

Advertisement

ఫిబ్రవరి 18న స్పీకర్ విచారణ

ఫిబ్రవరి 20 వరకు గడువు ఇవ్వాలని ఆయన కోరారు. ఫిబ్రవరి 18న ఆయన పిటిషన్‌పై  విచారణ చేపట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు.  మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ తన న్యాయవాదులతో విచారణకు శుక్రవారం హాజరయ్యారు.  విచారణకు ముందు దానం ఓ అఫిడవిట్‌ని స్పీకర్‌కు సమర్పించారు.

తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ పార్టీలో కొనసాగుతున్నానని ప్రస్తావించారు. 2024 మార్చిలో తాను కాంగ్రెస్ సమావేశానికి హాజరైంది కేవలం వ్యక్తిగత హోదాలోనేనని పేర్కొన్నారు.  పార్టీ మారినట్లు కాదని అందులో దానం ప్రస్తావించారు. దీంతో దానం వ్యవహారం కాస్త వెనక్కి వెళ్లింది.

ALSO READ: హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో రేవంత్ రెడ్డి.. విజయవంతంగా శిక్షణ పూర్తి

 

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×