Vijayalakshmi Arrested: అక్రమ కట్టడాలే లక్ష్యంగా రెచ్చిపోయిన.. శ్రీలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ యజమాని భరతం పట్టారు పోలీసులు. అక్రమంగా విల్లాల నిర్మాణాలు చేపట్టి.. ఏకంగా 300 కోట్ల మోసానికి తెర లేపింది గుర్రం విజయలక్ష్మి. అమెరికా పారిపోతుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అంటూ బ్రోచర్లు వేసి దోచేసింది ఈ కిలాడీ లేడీ. మల్లంపేటలోని FTL, బఫర్‌జోన్‌లో సర్వే నెంబర్లలో విల్లాల నిర్మాణం చేపట్టింది. 325 విల్లాలు నిర్మాణం చేపట్టిది. అందులో కేవలం 65కు మాత్రమే హెచ్‌ఎండీఏ అనుమతులున్నాయి. మిగిలిన వాటికి పంచాయతీ అనుతులు తీసుకుంది. కాని కస్టమర్లకు మాత్రం.. గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అంటూ కుచ్చుటోపీ పెట్టింది. తీరా మోసపోయామని గ్రహించిన బాధితులు వరుస ఫిర్యాదులు చేశారు. విజయలక్ష్మిపై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో 7 కేసులు నమోదయ్యాయి.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుగొలిపే విషయాలు..18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా
ప్రభుత్వ భూమిని కొంత అక్రమించి రీసెంట్‌గా మరో 5 విల్లాలు కూడా నిర్మాణాలు చేపట్టింది. మొత్తంగా ఆమె చేపట్టిన 325 విల్లాలు నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో.. రంగంలోకి దిగిన హైడ్రా గత సెప్టెంబరులో 15 విల్లాలను కూల్చేసింది. ఇక పోలీసులు అరెస్ట్ చేస్తారు అనే సమయంలో అమెరికా పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.