E-Paper
Advertisement

ACB raids Telangana: రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు.. భారీ అవినీతి బట్టబయలు

ACB raids Telangana: రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు..  భారీ అవినీతి బట్టబయలు
Advertisement

ACB raids Telangana: రిజిస్ట్రేషన్ విభాగంలో నెలకొన్న అవకతవకలను వెలికితీసేందుకు.. యాంటీ-కరప్షన్ బ్యూరో (ACB) పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. 14వ తేదీన ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా 23 స్పెషల్ టీంలు.. ఒకేసారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై సోదాలు ప్రారంభించాయి.

గండిపేట్, సేరిలింగంపల్లి, మెద్చల్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెదపల్లి, భూపాలపల్లి, వైరా వంటి అనేక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు నిఘా వేశారు. అక్రమ భూసంధుల, లంచాల వ్యవహారాలపై వచ్చిన సమాచారాన్ని ఖరారు చేయడానికి నిర్వహించిన ఈ సోదాల్లో అనేక కీలక విషయాలు బయటపడ్డాయి.

Advertisement

వివిధ కార్యాలయాలు, వ్యక్తుల వద్ద జరిగిన రైడ్స్‌లో ఏసీబీ అధికారులు రూ. 2,51,990 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్ము దేనికి సంబంధించినదో, ఎలాంటి రుసుము పేరుతో వసూలు చేసారో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయినప్పటికీ.. 289 పత్రాలు ప్రజలకు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని ఏసీబీ గుర్తించింది.

Advertisement

రైడ్స్‌లో 19 మంది ప్రైవేట్ వ్యక్తులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో.. నిర్బంధం లేకుండా తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.
వారితో పాటు 60 మంది డాక్యుమెంట్ రైటర్లు అనుమతి లేకుండా లోపల తిరగడం కనిపించింది.

అధిక సంఖ్యలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీటీవీ ఫుటేజ్ పనిచేయకపోవడం అధికారులు గమనించారు. ఇది అవినీతిని దాచడానికి ఉద్దేశపూర్వకంగా నిర్వహించబడిన చర్యగా ఏసీబీ భావిస్తోంది. సీసీ కవరేజ్ లేని చోటే ఎక్కువగా లంచాల లావాదేవీలు జరుగుతున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.

కేవలం ఆఫీసులతో ఆగకుండా ఏసీబీ జట్లు.. 13 మంది సబ్ రిజిస్ట్రార్ల నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించాయి. ఇందులో భారీగా

నగదు, బంగారు ఆభరణాలు, ప్రాపర్టీ డాక్యుమెంట్లు, స్వాధీనం చేసినట్టు సమాచారం. ఈ సొమ్ము పంపిన మార్గాలు, ఆస్తుల మూలాలు ఏవన్నది పూర్తిస్థాయి దర్యాప్తులో వెల్లడికానుంది.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి తంతు, అక్రమ పద్ధతులు, లంచాల వ్యవస్థ, మధ్యవర్తుల ప్రమేయంపై ఏసీబీ అన్ని ఆధారాలతో కూడిన వివరణాత్మక నివేదికను ప్రభుత్వానికి పంపింది.

 

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×