BigTV English

Hyderabad rain news: వామ్మో మళ్లీ వాన.. రానున్న 3 రోజుల్లో.. ఈసారి ఏం చేస్తుందో!?

Hyderabad rain news: వామ్మో మళ్లీ వాన.. రానున్న 3 రోజుల్లో.. ఈసారి ఏం చేస్తుందో!?
Rain updates in Hyderabad

Rain updates in Hyderabad(Telangana today news): హమ్మయ్య. వానలు గ్యాప్ ఇచ్చాయ్. రెండు రోజులుగా చినుకులు పడలే. ఇప్పటికే 10 రోజులకు పైగా వర్షం దంచికొట్టింది. ఆకాశంలో నీళ్లన్నీ అయిపోయి ఉంటాయ్. ఎండ కూడా కాస్తోంది. ఇక వానలు పడవులే..అనుకుని మండే మార్నింగ్ ధీమాగా బయటకు వచ్చారు జనాలంతా. కట్ చేస్తే.. సాయంత్రానికి షాక్ ఇచ్చాడు వరణుడు. వదల బొమ్మాళీ అంటూ.. మళ్లీ కుమ్మేశాడు. హైదరాబాద్‌లో మరోసారి ఓ రేంజ్‌లో వర్షం పడింది. మళ్లీ నగరం తడిచి ముద్దైంది.


సాయంత్రం 4 తర్వాత.. స్కూళ్లు, ఆఫీసులు ముగిశాక.. పగ పట్టినట్టు.. సరిగ్గా టైమ్ చూసుకొని మరీ వాన వెల్లువెత్తింది. అప్పటికే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయి ఉన్నాయి. ఈ సమయంలో వర్షం పడితే ఇంకేముంది..అంతా ఆగమాగం. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్.

జూబ్లీహిల్స్, మాదాపూర్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, లింగంపల్లి, మియాపూర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్.. ఇలా సిటీ అంతా వాన పడింది. వాహనాలకు వాటర్ బ్రేక్ వేసింది. స్కూల్ బస్సులు, కార్లు, ఆటోలు, బైక్‌లు.. సర్వం జంక్షన్లో ఇరుక్కుపోయాయి. గంటల తరబడి రాస్తారోకో.


ఇప్పటికే వారం రోజులుగా బడులు బంద్. ఐటీ ఎంప్లాయిస్ వర్క్‌ఫ్రమ్ హోమ్. వానలు తగ్గాయి కదాని భ్రమపడ్డారు. ఎండ కొడుతోంది కదాని బిందాస్‌గా ఉన్నారు. మండే ఫ్రెష్‌గా ఆఫీసులకొచ్చారు. సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్దామనుకుంటే.. ఎరక్కవచ్చి ఇరుక్కుపోయినట్టైంది పరిస్థితి. వాన పడుతుందని ముందే తెలుసుంటే.. కనీసం ఐటీ ఉద్యోగులైనా ఇళ్లల్లో ఉండేవాళ్లు. సిటీలో ట్రాఫిక్ కాస్తైనా తగ్గేది. ఆ ఛాన్స్ లేకుండా.. సడెన్‌గా విరుచుకుపడింది వాన.

అప్పుడే అయిపోలేదన వానలు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం, బుధవారం వరకూ వర్షాలు పడుతాయని లేట్‌గా అప్‌డేట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు మళ్లీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

అలర్ట్ అనగానే హడలిపోతున్నారు ప్రజలు. మొన్నటి వరకూ కురిసిన వానలకు.. ఇంకా తడి కూడా ఆరిపోలేదు.. వరద కూడా వెళ్లిపోలేదు.. అప్పుడే మళ్లీ వర్షాలా? వామ్మో అంటూ బిక్కుబిక్కుమంటున్నారు. ఈసారి వానలతో పాటు ఈదురు గాలులు కూడా వీస్తాయట. ఇంకెంత డ్యామేజ్ చేసేందుకో..?

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×