BigTV English

Janwada Farmhouse: జన్వాడ ఫామ్ హౌస్‌లో సర్వే చేసిన అధికారులు.. రేపో మాపో కూల్చుడేనా..?

Janwada Farmhouse: జన్వాడ ఫామ్ హౌస్‌లో సర్వే చేసిన అధికారులు.. రేపో మాపో కూల్చుడేనా..?

Survey of irrigation and revenue officers in Janwada Farmhouse: హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి జన్వాడ ఫామ్ హౌస్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. జన్వాడ ఫామ్ హౌస్ ను కూడా కూల్చేస్తారంటూ పలు వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున దీనిపై చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ విలేజ్ లోని ఫామ్ హౌస్ ప్రాంతంలో నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు.


సర్వే నెంబర్ 311(311/7)లో 1210 చదరపు గజల్లోని 3894 చదరపు అడుగుల మేర నిర్మించిన ఫామ్ హౌస్ విషయంలో నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకోవాలంటూ ఇటీవలే హైకోర్టు కూడా హైడ్రాకు పలు ఆదేశాలను జారీ చేసింది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలుంటే నిబంధనల మేరకు నోటీసులు ఇవ్వాలని, విక్రయ దస్తావేజు, అనుమతులు, ఇంటి పన్ను రసీదులన్నింటినీ పరిశీంచిన తరువాతనే నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అధికారులు రంగంలోకి దిగారు.

ఇదిలా ఉంటే.. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారంటూ భారీగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో కూడా అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు.


Also Read: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారా? సెప్టెంబర్ 17 నుంచి దరఖాస్తులు షురూ

జన్వాడ ఫామ్ హౌస్ పక్క నుంచి ఫిరంగి నాలా ప్రవహిస్తుంటది. అయితే, నాలాలోనే ఫామ్ హౌస్ ప్రహరీగోడ్, గేటును నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శంకరంపల్లి ఎమ్మార్వో ఆదేశాల మేరకు అధికారులు ఆ ఫామ్ హౌస్ వద్దకు చేరుకుని నాలాను పరిశీలించారు.

ఈ విషయం తెలిసిన ప్రజలు ఈ ఫామ్ హౌజ్ పై అధికారులు ఏ నిర్ణయం తీసుకున్నారు? అంటూ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×