BigTV English

Mathu Vadalara2: చిట్టి.. మత్తు వదిలిస్తుందా.. ఎక్కిస్తుందా.. ?

Mathu Vadalara2: చిట్టి.. మత్తు వదిలిస్తుందా.. ఎక్కిస్తుందా.. ?

Mathu Vadalara2: జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా.  చిట్టి.. నీ నవ్వంటే లక్ష్మీ పటాసే అనే పాటతో అందరి హృదయాల్లో తన నవ్వును పదిలంగా పెట్టేసింది.    ఇక ఈ సినిమా ఇచ్చిన హిట్ తో ఓవర్ నైట్ లోనే  ఫరియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.


జాతిరత్నాలు తరువాత ఈ ముద్దుగుమ్మ  ఎక్కడ కనిపించినా చిట్టి అనే పిలుస్తున్నారు.  అయితే ఈ చిన్నదానికి జాతిరత్నాలు తరువాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి కానీ, విజయాలు  మాత్రం దక్కలేదు. ఈ మధ్యనే కల్కి సినిమాలో ఒక చిన్న ఫ్రేమ్ లో మెరిసిన ఫరియా.. ఒక లక్కీ ఛాన్స్ ను పట్టేసింది.

కీరవాణి కొడుకు శ్రీసింహా హీరోగా పరిచయమైన మత్తు వదలరా సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 5 ఏళ్ల  తరువాత మత్తు వదలరా కు సీక్వెల్ ప్రకటించిన  విషయం తెల్సిందే. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13 న  రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా  ప్రకటించారు. ఈ సీక్వెల్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.


ముఖ్యంగా శ్రీ సింహా, సత్య కామెడీ ట్రాక్ ఈసారి నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని సమాచారం. మొదటి పార్ట్ లో హీరోయిన్ లేదు. అయితే ఈసారి ఈ చిత్రంలోకి ఫరియా అడుగుపెట్టింది. తాజాగా  ఫరియా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రివీల్ చేస్తూ.. ఆమెను చిత్రబృందంలోకి ఆహ్వానించారు. నిధి అనే పాత్రలో ఫరియా కనిపించనుంది.

ఇక ఈ పోస్టర్ లో చిట్టి.. చేతిలో గన్ పట్టుకోని  లేడీ పోలీస్ ఆఫీసర్ లుక్ లో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. చిట్టి లుక్ ను బట్టి.. నేరస్తుల దుమ్ము దులిపేలానే కనిపిస్తుంది. మరి ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ మత్తు వదిలిస్తుందో.. ఎక్కిస్తుందో.. ? చూడాలి. కనీసం ఈ సినిమాతోనైనా చిట్టి మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×