E-Paper
Advertisement

Telangana Assembly session 2026: తెలంగాణలో పెట్టుబడులపై రచ్చ.. కేటీఆర్‌ వర్సెస్ మంత్రి శ్రీధర్‌బాబు, మాటకు మాట

Telangana Assembly session 2026: తెలంగాణలో పెట్టుబడులపై రచ్చ.. కేటీఆర్‌ వర్సెస్ మంత్రి శ్రీధర్‌బాబు, మాటకు మాట
Advertisement

Telangana Assembly session 2026: తెలంగాణలో పెట్టుబడులపై అసెంబ్లీ వేదికగా అధికార- విపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయి చేరింది. కేటీఆర్ లేవనెత్తిన వివిధ అంశాలపై ధీటుగా బదులిచ్చారు మంత్రి శ్రీధర్‌బాబు. బీఆర్ఎస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారంపై ఆయన మండిపడ్డారు. అసలు సభలో ఏం జరిగింది?

తెలంగాణలో పెట్టబడులపై రెండోరోజు సమావేశాల్లో రచ్చ

Advertisement

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండురోజు సమావేశాలు వాడీ‌వేడిగా సాగాయి. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల వ్యవహారంపై కేటీఆర్ పలు ప్రశ్నలు అధికార పార్టీకి సంధించారు. ఏడు, ఎనిమిది లక్షలు కోట్లు పెట్టుబడులు వచ్చాయంటూ నేతలు పదే పదే చెప్పడాన్ని ప్రశ్నించారు. నేతలు చెప్పే మాటలు కోటలు దాటుతున్నాయని అన్నారు.

గ్లోబల్ సమ్మిట్‌లో 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు నేతలు చెబుతున్నారని, టీఎస్ ఐపాస్ వెబ్‌సైట్ ప్రకారం.. 2022-23లో 3100 పరిశ్రమలు, 2021-22లో 4 వేల పరిశ్రమలు వచ్చినట్టు చెప్పారు. 2024-25లో 2050 పరిశ్రమలు, 2025-26లో 1126 పరిశ్రమలు వచ్చినట్టు లెక్కలు ఉన్నాయని ప్రశ్నించారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు ఏం చెబుతారని అన్నారు.

Advertisement

కేటీఆర్ ప్రశ్నలకు ధీటుగా కౌంటరిచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు

కేటీఆర్ లేవనెత్తిన అంశాలపై ధీటుగా బదులు ఇచ్చారు మంత్రి శ్రీధర్‌బాబు. గ్లోబల్ సమ్మిట్‌లో రూ. 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయన్నారు. ప్రభుత్వం, ఇక్కడున్న వాతావరణంపై నమ్మకం కలిగి పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారవేత్తలు ముందుకొచ్చారన్నారు. ప్రభుత్వపరంగా ఎక్కడా ఇబ్బంది రాకుండా చేశామన్నారు. గ్లోబల్ తరహాలో ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని పదే పదే ప్రభుత్వం చెబుతోందని అన్నారు కేటీఆర్. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తే అప్పుడు 100 ట్రిలియన్ ఎకానమీ అవుతుందన్నారు. మీరు చెప్పే ఒక ట్రిలియన్, నాలుగు ట్రిలియన్ కాదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు, అబద్దపు మాటలతో ఎన్నేళ్లు నడిపిస్తారు?

ALSO READ: మహిళల గురించి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి .. కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్!

దీనిపై కేటీఆర్‌కు కౌంటరిచ్చారు మంత్రి శ్రీధర్‌బాబు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది మా ప్రభుత్వం యొక్క విజన్ అని అన్నారు. మహిళల సాధికారత విషయంలో హేళనగా మాట్లాడడం సరికాదన్నారు. సభలో ఆయన మాట్లాడిన మాటలను విత్ డ్రా చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో మహిళలు మనోస్థైర్యం పొందుతున్న ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నాయకులు ఇలా మాట్లాడడం తగదన్నారు. దీనిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలా అని బీఆర్ఎస్‌ని ప్రశ్నించారు.

 

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×