E-Paper
Advertisement

Deputy CM Bhatti Vikramarka: మహిళల గురించి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి .. కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్!

Deputy CM  Bhatti Vikramarka: మహిళల గురించి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి .. కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement

Deputy CM Bhatti Vikramarka: స్వేచ్ఛ, బ్యూరో: రైతు భరోసా కాకుండా ఒక్కో రైతుకు వరి ధాన్యం బోనస్ పేరిట 25000 హాజరవుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. రైతుల శ్రమను గుర్తించి సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్ రైతుల ఖాతాలో వేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో 9,000 కోట్లు కేవలం తొమ్మిది రోజుల్లో వారి ఖాతాలో జమ చేశారు అన్నారు. వడ్డీ లేని రుణాల కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు సంవత్సరానికి 20వేల కోట్ల పైగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు ఇప్పటివరకు వడ్డీ లేని రుణాల కింద 57 వేల కోట్లను మహిళల ఖాతాలో జమ చేశామని తెలిపారు. మహిళలు బాగుపడితే కుటుంబం మొత్తం బాగుపడుతుంది తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. టిఆర్ఎస్ నేతలకు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. ప్రతి సందర్భంలో కేటీఆర్ మహిళల మనసు గాయపరుస్తున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ మహిళల గురించి జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి అన్నారు.

Also Read:Delhi shocking: యువతను చంపేస్తున్న రీల్స్ పిచ్చి .. పిస్టల్‌తో ప్రాణం తీసుకున్న యువకుడు, వీడియో వైరల్ 

కేటీఆర్ అవగాహన  లేదు 

Advertisement

కేటీఆర్ దారి తప్పి మాట్లాడుతున్నారు అనిపిస్తుంది, మహిళల అభివృద్ధి గురించి వారికి శ్రద్ధ ఉంటే వారి క్యాబినెట్లో మహిళలకు అవకాశం కల్పించేవారు అని అన్నారు. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వడ్డీ లేని రుణాలు చెక్కులు చెల్లించుకుంటూ పోతున్నాం, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అడ్డం కులు సృష్టించిన ముందుకు పోతూనే ఉంటాం అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళలను మహారాణులుగా గౌరవిస్తుంది వారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఎక్కడ ఆలస్యం అవుతుందో అని ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాం అని తెలిపారు.

3,500 ఇళ్ల 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం

ఆడబిడ్డల పక్షాన బస్సు చార్జీలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి క్రమం తప్పకుండా ప్రతినెలా చెల్లిస్తుందని వివరించారు. అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు, మేకలను ఎక్కడ కట్టివేయాలి అని మేము డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని పదేళ్లపాటు మాటలు చెప్పారు, టిఆర్ఎస్ నేతల మాటలు నమ్మి ప్రజలు చూసి చూసి కళ్ళు కాయలు కాసేయ్. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మాత్రం రాలేదు అన్నారు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున మంజూరు చేసి నిండు నిర్మాణం ప్రారంభించాం. మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఒకేసారి 22,500 కోట్లు మంజూరు చేశాం దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజా ప్రభుత్వం అమలు చేసుకుంటూ ముందుకు పోతుందని తెలిపారు. కానీ టిఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, దళిత సీఎం, భూమిలేని పేదలకు వ్యవసాయ భూమి పంపిణీ హామీల్లో ఏ ఒక్కటి పది సంవత్సరాల కాలంలో నెరవేర్చలేదు అన్నారు.

Advertisement

Also Read: Drunken Attack: వరంగల్‌లో ఆకతాయిల వీరంగం.. బైక్‌పై వెళ్తున్న వారిపై బీరు సీసాలతో దాడి, సీసీ ఫుటేజ్

Tags

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×