BigTV English

Telangana Budget 2024 highlights : తెలంగాణ బడ్జెట్ రూ. 2,75,891 కోట్లు.. 6 గ్యారంటీలకు రూ. రూ. 53,196 కోట్లు..

Telangana Budget 2024 highlights : తెలంగాణ బడ్జెట్ రూ. 2,75,891 కోట్లు.. 6 గ్యారంటీలకు రూ. రూ. 53,196 కోట్లు..

Telangana Budget 2024 Bhatti Vikramarka Speech: తెలంగాణ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. రూ. 2,75, 891 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను రూపొందించారు. బడ్జెట్ లెక్కలను సభలో వివరిస్తున్నారు.


తెలంగాణ త్యాగమూర్తుల ఆశయ సాధన దిశగా కార్యచరణ రూపొందిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మాక మార్పు తెస్తామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎంతటి కష్టానైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.నిస్సాహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సమానత్వమే తమ ప్రభుత్వ విధానమన్నారు. అందరి కోసం మనందరం అనే స్పూర్తితో ముందుకు వెళ్తామన్నారు.

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని భట్టి హామీ ఇచ్చారు.ప్రజా సంక్షేమం కోసం 6 గ్యారెంటీలను ప్రకటించామని చెప్పారు. ఆ గ్యారెంటీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని భట్టి విక్రమార్క అన్నారు. ఒకటో తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు.


తెలంగాణ బడ్జెట్ 2,75, 891 కోట్లు
గతేడాది కన్నా రూ. 51,266 కోట్లు అధికం
రెవెన్యూ వ్యయం రూ. 2, 01, 178 కోట్లు
మూలధన వ్యయం రూ. 29, 669 కోట్లు

శాఖలవారీగా కేటాయింపులు..
పురపాలకశాఖకు రూ. 11,692 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ. 13,313 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ. 21, 874 కోట్లు
బీసీ సంక్షేమానికి 8 వేల కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ.2,262 కోట్లు

విద్యారంగానికి రూ. 21,389 కోట్లు
వైద్యరంగానికి రూ. 11, 500 కోట్లు
గృహ నిర్మాణశాఖకు రూ.7,740 కోట్లు
పరిశ్రమలకు రూ. 2,543 కోట్లు

6 గ్యారంటీలకు రూ. 53,196 కోట్లు
వ్యవసాయశాఖకు రూ. 19,746 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కు రూ. వెయ్యి కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు

విద్యుత్ శాఖకు రూ. 16,825 కోట్లు
పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధికి రూ. 40, 080 కోట్లు
నీటిపారుదలశాఖకు రూ. 28,024 కోట్లు

దళిత బంధుకు 17,700 కోట్లు
మేడారం జాతరకు రూ. 110 కోట్లు
గృహజ్యోతి పథకానికి రూ. 2,418 కోట్లు

విద్యారంగానికి కేటాయింపులు..
బీసీ గురుకులాల సొంత భవనాల కోసం రూ. 1,546 కోట్లు
ఎస్టీ గురుకులాల భవన నిర్మాణానికి రూ. 250 కోట్లు
ఎస్సీ గురుకుల భవనాల నిర్మాణానికి రూ. వెయ్యి కోట్లు
గురుకులాల్లో సౌర విద్యుత్ ఏర్పాటు
గురుకుల పాఠశాల సొసైటీ ద్వారా 2 ఎంబీఏ కాలేజీలు ఏర్పాటు
ప్రైవేట్ భాగ్యస్వామ్యంతో రాష్ట్రంలో 65 ఐటీఐలు ఏర్పాటు
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కు రూ. 500 కోట్లు
విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధి రూ. 500 కోట్లు
ఉన్నత విద్య ప్రోత్సాహానికి రూ. 550 కోట్లు

ప్రైవేట్ బిల్డింగుల్లోని బీసీ హాస్టల్స్ కు ప్రభుత్వ భవనాల నిర్మిస్తామని భట్టి హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీకి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రైతు బంధు నిబంధనలను సమీక్షిస్తామన్నారు.

దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ టూరింజ్ సర్య్కూట్ ఏర్పాటు చేశామని చెప్పారు. దేయాదాయ భూములను పరిరక్షిస్తామని స్పష్టంచేశారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణకు నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు.

ప్రతీ పంటకు మద్దతు ధర ఇస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణ.
డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం.
తెలంగాణ భవిష్యత్తును కాపాడతాం.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×